పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గీ.

పాశుపతములు రెండు [1]నీభంగిఁ బోర
నజుఁడు హరియును వారింప నలవిగాక
విస్ఫులింగచ్ఛటావళివేష్టనమున
స్రుక్కుచుండిరి యంగముల్ [2]పొక్కిపడఁగ.

99


గీ.

త్రిభువనంబును భయమందె దేవదైత్య-
ఖచరసిద్ధగంధర్వులు కలఁగఁబడిరి
అస్త్రరాజద్వయంబు సంహారకాల-
దహనుభంగి నేకాంగయుద్ధంబు సేయ.

100


గీ.

అస్త్రయుద్ధము మాన్ప హర్యజులఁ గావఁ-
దలఁచి యర్ధేందుమౌళి యత్యంతకరుణ
నస్త్రములు రెంటినడుమ నయ్యవసరమున
సంభవించె [3]మహానలస్తంభమూర్తి.

101


స్రగ్ధర.*

స్తంభం బావిర్భవించెన్ జ్వలదనలశిఖాజాలముల్ దిక్కులందున్
జృంభించెన్ భూర్భువస్స్వస్థిరతరజఠరక్షేత్రముల్ చంచదుల్కా-
సంభారోద్యత్స్ఫులింగస్థగితములుగ నాశంక విశ్వంభరుండున్
శంభుండున్ సంభ్రమింపం జటులకరతటిత్సన్నిభస్ఫూర్తిమూర్తిన్.

102


సీ.

సప్తపాతాళవిష్టపము[4]లు భేదించి
          ధరణిచక్రంబు బిందం బొనర్చి
భూర్భువస్స్వర్లోకములు సమాస్ఫాటించి
          ధ్రువమండలంబుఁ దుత్తుమురు చేసి
పరమేష్ఠిపదవి కుద్భ్రాంతి యాపాదించి
          హరిపదంబున కార్తి యావహించి
బ్రహ్మాండకుహరకర్పరము వ్రక్కలు వాపి
          యావరణంబు లందంద చించి


గీ.

[5]పరగఁ బుష్కరమార్గంబు పాయఁబట్టి
యెగసి యెచ్చోట కేఁగెనొ యెఱుఁగరాదు
శాతకుంభాద్రికూటాగ్రసన్నిభంబు
శాంభవంబైన పావకస్తంభ మపుడు.

103


గీ.

పాలుగల [6]యగ్గికంబంబు ప్రభవ[7]మంది
యుష్ణమును శీతమును గాకయుండెఁ గాని
యహహ పెట్లు జగం బుష్ణ మయ్యెనేని

  1. తా. నిబ్భంగి
  2. ము. సొక్కి
  3. ము. మహాస్తంభ శంభుమూర్తి
  4. తా. లుద్భేదించి
  5. తా. పరమ పుష్కరమార్గంబు పాయఁదట్టి
  6. తా. యట్టి
  7. తా. మందె