పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


హృదయమున (నిట్టిదని నిశ్చయింపలేక).

61


ఉ.

(ఎక్కడఁ బోయెనో ధరణి యిందునిభాకరు) లెందణంగిరో
చుక్కలసుద్ది యెద్ది[1]యొకొ చూడఁగఁ గందుమె పర్వతంబులన్
దిక్కుల చాయ లెవ్వి యని ధీరత నల్విటు చింత[2]నొందె నే
(సక్కటి చూచినం దిమిరసం)హతి విశ్వము ముంచియుండఁగన్.

62


క.

అంతఃకరణంబున నటు
చింతిలి యుండుచుఁ బ్రపంచసృష్టికినిఁ [3]గ్రియో-
దంతమ్ము లేక దుర్వ్యథ
సంతన కట్టఁగ విధాత చాలండయ్యెన్.

63


వ.

వెండియు బహువిధంబుల నూహాపోహ లొనర్చియుఁ బుండరీకసంభవుండు భువననిర్మాణక్రియారంభంబునకు నుపాయంబుఁ గానక చీకాకుపడి కాకోదరగ్రామణీగ్రైవేయు భగవంతుం గృతాంతఘస్మరు సంస్మరించి తత్ప్రసాదంబున వసుంధరాగోళంబు మహాంధకారమగ్నం బగుట యెఱింగి యజ్జగద్ధాత్రుల నుద్ధరింపం దలంచి.

64


శా.

క్రోడాకారము దాల్చి కంఠభవఘుర్ఘుర్ ధ్వానవిస్ఫూర్తిఁ బా-
తాళక్రోడమహా[4][87]కటాహమున సందారింపఁ దత్కంధరా-
గోళస్థాయినియైన భూమి పృథువక్షోజప్రదేశంబునన్
లీలాసత్పులకాంకురంబు లెగయన్ వెన్నుండు మున్నీటిలోన్.

65


గీ.

లోఁతుమున్నీటిలోపల నీఁతలాడెఁ
గూట[5]కోలావతారుఁడై కైటభారి
చటులవాల కశాఘాతసంప్రభూత-
[6]నీరమడ్డుస్వనంబున నింగి యదుర.

66


సీ.

కాఁడిపాఱిన మేనిగరులు బ్రహ్మాండంబు
          [7]కడపపూబంతి కక్కజము దోఁప
ఖురపుటంబునఁ గీలుకొని మేరుకుధరంబు
          మువ్వలోపలి [8]ఱాతిమురువు [9]వడయ
దీర్ఘకంఠకఠోరఘుర్ఘురస్వనమునఁ
          బాతాళగోళంబు బాతళింప
నీలాంబుదశ్యామనిబిడదేహచ్ఛాయఁ
          [10]బ్రళయాంధకారంబు దొలకరింప

  1. తా. యకొ
  2. ము. నొందఁగా
  3. తా. క్రియావంతవ్యుని కంతర్వ్యథ
  4. ము. కటాహము సముద్ఘాటింప, తా. కటాహమున సంధానింప
  5. ము. క్రోడావతారుఁడై
  6. తా. నీరవండుస్వరంబున
  7. ము. కనుప
  8. తా. రాయి
  9. తా. నెరయ
  10. ము. ప్రళయాంతకాలంబు