పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విమానాశ్రయంలో మరో మెరుపు మెరిసింది. ఆ మెరుపు తాలుకు వెలుగు ప్రసిద్ద సినీ నటి, పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి జమునా రమణారావు, భారత ప్రభుత్వం తరపున ఏకైక ప్రతినిధిగా ఆమె మారిషస్ తెలుగు మహాసభలకు వస్తున్నారు. ప్రథమ, ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభల విజయానికి కృషి చేసిన వారిలో శ్రీమతి జమునా రమణారావుగారు ముఖ్యమైన వ్యక్తి ఆత్మీయురాలైన ఆమె రాక మాకెంతో" ఆనందాన్ని కలుగజేసింది.

తెలుగు విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ డా॥ ఎన్.శివరామమూర్తిగారు మాకెంతో ఆప్తులు. ప్రముఖ భాషా శాస్త్రవేత్త అయిన డా॥ శివరామమూర్తిగారు మా నాన్నగారు అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షులుగా వ్యవహరించిన సమయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా వుండేవారు. అప్పటినుంచి ఆయన మాకు సన్నిహితుడు. సౌమ్యుడు, స్నేహశీలి అయిన శివరామమూర్తిగారు కూడా అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

నాకు అత్యంత ఆప్తులైన మరో వ్యక్తి తెలుగు విశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి శ్రీ గోవిందరాజు రామకృష్ణారావుగారు. వారి స్వగ్రామం అవనిగడ్డ కావటం వలన మా మైత్రి మరీ బలపడేందుకు కారణం అయ్యింది. చురుకైన వ్యక్తి మెత్తని మనిషి అయిన శ్రీ రామకృష్ణారావుగారు ఎవరి దగ్గర పనిచేసినా ఆర్భాటం లేకుండా కార్యదక్షత కనపరుస్తారు. ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక, అఖిల భారత తెలుగు సాంస్కృతిక ఉత్సవాల ప్రత్యేక సంచిక ఆయన రూపకల్పన చేసినవే. బాల పిల్లల మాసపత్రిక సంపాదకమండలిలో మేమిద్దరం సభ్యులం. రచనా వ్యాసంగానికి నన్ను ఉత్సాహపరిచేవారు.

స్నేహశీలి, నిరాడంబరుడు, తాను చేపట్టిన ఏ పనినైనా చిత్తశుద్ధితో చేయగల సమర్ధుడైన అధికారి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ శ్రీ సి.వి. నరసింహారెడ్డిగారు మాకు చిరపరిచితులు, సన్నిహితులు. ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలలో ఆయన ప్రముఖపాత్ర నిర్వహించారు. సమాచార పారసంబందాలలో నిష్ణాతులైన శ్రీ నరసింహారెడ్డి ప్రథమ ప్రపంచ సభలకు దేశవ్యాప్తంగా బహుళ ప్రచారం జరగటానికి కారకులయ్యారు.

ఇక సాంస్కృతిక బృందాలకు చెందిన ప్రతినిధులను గురించి ముచ్చటించవలిసి వస్తే, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మృదంగ విద్వాంసుడు శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావుగారి గురించి సగర్వంగా చెప్పకోవచ్చు.

ముప్పై గంటలపాటు ఏకథాటిగా మృదంగాన్ని వాయించి వరల్డ్ రికార్డు