Jump to content

పుట:మధుర గీతికలు.pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీపావళి



నాఁడు దీపాలయమవసి_నభమునుండి.
తార లెల్ల నుఁడిగివచ్చి ధరణిమీఁద
చిత్రకాంతుల నవతరించెనో యనంగ,
దీపికారాజి పుర మెల్ల. తేజరిల్లె.

సాటి లేనట్టి సిరులచే మేటి కెక్కి
మున్ను శ్రీనగరంబున చెన్ను మీఱు
దేవదత్తుని సుందరదివ్యగృహము
నేఁడు పొలుపఱి యేటికో పాడు వాఱె

వీటియం దెల్ల యెడలను వెలుఁగుచున్న
దీపికాకోటికాంతికి సైఁ పలేక,
అంధకారపరంపర లాశ్రయించె
దేవదత్తుని శూన్యమందిరము నేఁడు.

1