ఈ పుట ఆమోదించబడ్డది
ప్రేమకును లోనుగానట్టి దేది కలదు?
ప్రకృతి రమ్య ప్రదర్శనరంగమునను
సకలమైన చరాచరజాలమందు
నిండి నిబిడీకృతం బయి యుండు ప్రేమ.
ప్రేమ దేవుండు, ప్రేమయే విశ్వ మెల్ల,
ప్రేమయే సృష్టికంతకు ప్రేరణంబు;
ప్రేమ యను వస్తు వొకటి లోపించెనేని
లోక మంతయు నల్లకల్లోల మగును.
39