పుట:భాస్కరరామాయణము.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ర్పడ నమరేంద్రుబాడుదల పట్టినరావణి రోషదీప్తుఁ డై
[1]విడిపడి మించు మంచిపటువిక్రమసంపద సొం పెలర్పఁ గాఁ
బడమటిదిక్కువాకిట నపారబలంబులతో వెలింగెడున్.

443


ఆ.

అమితబలసమేతు లయి శుకసారణు, లుత్తరంపుగవని నున్నవారు
దశముఖుండు నంద తా నుండువాఁడుగా, నిశ్చయించినాఁడు నృపవరేణ్య.

444


క.

లక్షలుఁ గోటులు గుము లై, రక్షోనాయకులు గొలువ రభసమున విరూ
పాక్షుఁడు గర్జిల్లెడు రణ, దీక్షితుఁ డై మధ్యమప్రదేశమునఁ బురిన్.

445


వ.

అని పలికి నిశాచరవీరులసమరసన్నాహప్రకారంబు విన్నవించిన.

446


క.

అతనికి నీతఁడు దగువాఁ డితనికి వాఁ డెక్కు డతని కీ డగు నాకు
త్సితునకు నీ డగు నని యా, యతబలు లందఱును నోర్తు మని తలఁచి తగన్.

447


సీ.

నిష్ఠురబలశాలి నీలుఁ డాదుర్మదాం, ధుఁడు ప్రహసుఁడు గాచు తూర్పుగవని
నతివీరభంగదుఁ డంగదుఁ డమ్మహా, పార్శ్వాదు లెసఁగునవాచిగవని
ససహాయశూరుండు హనుమంతుఁ [2]డయ్యింద్ర, జితుఁడు నిలిచెడుపశ్చిమపుగవని
ననుజుండు నేను నకయ్యఖిలలోకద్రోహి, దశకంఠుఁ డుండునుత్తరపుగవని
వనచరేంద్రజాంబవద్విభీషణముఖ్యు, లైనమేటిదొరలు నఖిలబలము
వీటిచుట్టుఁ గలయ విడియుద మంచును, నృపవరేణ్యుఁ డనికి నిశ్చయించె.

448


వ.

ఇట్లు కృతనిశ్చయుం డగుచు సుగ్రీవదశగ్రీవానుజులం జూచి సువేలాధిరోహ
ణంబు చేసి లంకఁ గలయం గనుంగొనవలయు నీరాత్రి దీని నెత్తంబునం
బుత్త మనుచు నధిజ్యశరాసనుండై లక్ష్మణుండును సుగ్రీవవిభీషణజాంబవదాంజ
నేయగజగవయగవాక్షగంధమాదనశరభశతవలిసుషేణదుర్ముఖప్రముఖు లైన
వలీముఖయూథనాథులు దమతమబలంబులతోడను గొలిచిరా నమ్మహీధరోత్త
మం బెక్కె నాసమయంబున.

449


మ.

అట మిన్నందినకొమ్మలుం గలిగి గర్జాడంబరం బంబర
స్ఫుటనాభీలముగాఁ దటిద్భహుళ మై సొం పారునీలాంబుభృ
త్పటలంబో యన వప్రచక్రమునఁ బైపై నార్చుచుం గైదువు
ల్చిటిలం ద్రిప్పుచు నొప్పురక్కసుల నోలిం గాంచి రవ్వానరుల్.

450


వ.

అట్లు గాంచి భూనభోంతరాళం బద్రువ నార్చుచుం గలయ నవలోకించి.

451


తే

రజనిచరదుర్ణయార్జితరాజ్యలక్ష్మి, [3]దొడిమ లేక వ్రేలుచు వెలింగెడు బెడంగొ
కాక ముక్కంటి గెలిచిన కడిఁదిపురము, లొక్కవీడుగ దశకంఠుఁ డెక్కినాఁడొ.

452


శా.

ఈలంకాపురిక్రిందు దారి రవితే రేతేఁ బురచ్ఛాయ దాఁ
బోలం జొప్పడెఁ గాక మింట నొకవేల్పుంబ్రోలు నాఁ బోలునే
సాలం బింతవిశాలముం బొడవునే సౌధావళీగోపుర

  1. విడు విడు మంచు మిట్టిపడువిక్రమ
  2. డయ్యింద్రజిత్తుఁడు నిలుచు పశ్చిమ
  3. దొడరు లేక