పుట:భాస్కరరామాయణము.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

కపినాథుండవు నీవు రాఘవుఁ డనంగాఁ దాపసుం డాసురా
ధిపు మువ్వెట్టియుఁ గొన్న రాక్షసకులాధీశుండ నే నిన్ను ని
క్కపుఁదోఁబుట్టువు గా మదిం దలఁతు సఖ్యం బైన నాతోన పొం
దుపడుం గావున నేఁగు మీ వెడఁగు మర్త్యుం బాసి కిష్కింధకున్.

200


క.

అటు గాకున్న సురాసుర, భటులకు రారానిలంకపై నరులకు మ
ర్కటులకు రావచ్చునె యను, మటమీఁదం జూచికొంద మంతతెఱంగున్.

201


నావుడు నతఁ డొకకీరం, బై వెసఁ జని నింగి నిలిచి యగచరపతితో
రావణుసందేశము గడు, [1]సావరమునఁ జెప్పి మరలి చనఁ దోన కపుల్.

202


క.

వడి నెగసి వాలములఁ గొని, వెడచఱువం జఱిచి దొంగ వీఁడు మనకు లోఁ
బడియె ననుచుఁ బిడికిళ్లం, బడఁ బొడిచిరి పట్టి తెచ్చి భానుజు నెదుటన్.

203


క.

అత్తెఱఁగున నొప్పింపఁగఁ, దత్తఱపడి రాముఁ జూచి ధరణీశ్వర వీ
రె త్తెత్తి గ్రుద్దుచున్నా, రిత్తఱిఁ గృపఁ జూడవే శుభేక్షణ నన్నున్.

204


క.

(అధిపతిపంపున వెఱవక, యధికంబుగ నిష్ఠురోక్తు లాడిన నిచ్ఛా
విధిఁ బలికిన వార్తావహు, వధియించుట కర్జమే వివస్వద్వంశా.)

205


వ.

అనిన విని రామచంద్రుండు విడిపించి పుచ్చుటయు వాఁడు నంతరిక్షంబున కెగసి
సుగ్రీవా దశగ్రీవుతో నేమి చెప్పుదుం జెప్పు మనిన నతం డలుక నచ్చిలుకం గనుం
గొని.

206


సీ.

తలపోసి చూచినఁ దా నాకు నవ్వాలిఁ, బోలిన యట్టితోఁ బుట్టు వనుము
వసుమతీసుత నట్లు వంచించి తెచ్చుట, మగటిమి గా దది మఱవకు మను
లోక మరాక్షసకలోకంబుగాఁ జేయఁ, గపిసేనతో వారి గడతు మనుము
లంకఁ ద్రికూటాచలముతోన మున్నీటఁ, బెఱికి పేటాడి పై తపింతు మనుము
యాతుధానరాజ్యంబున కర్హుఁ డైన, మావిభీషణుఁ డలర లక్ష్మణుఁడు గడఁగి
భీకరాశుగసప్తార్చిఁ బేర్చునర్చు, లెసఁగ నింద్రజిచ్ఛలభంబు నేర్చు ననుము.

207


విలు యూపంబు శరాళి దర్భతతి మౌర్వీటంకృతుల్ మంత్రముల్
[2]గలితాసృక్ఛట లాజ్యధారలు నిషంగద్రోణికల్ స్రుక్స్రువం
బులు గా రాముఁడు యాజకుం డయి సమిద్భూవేదిఁ గోపానలా
ర్చులతో నద్దశకంఠుఁ డన్పశువు వేల్చున్ నిర్జరప్రీతిగన్.

208


క.

దిక్కు గలదేని చను మను, మెక్కుడు దర్పమున జగము లేచుట లింకం
జిక్కె నను పొమ్ము నీ వని, యక్కపిపతి పలుక నప్పు డంగదుఁ డలుకన్.

209


తే.

కపటచారుండు వీఁడు నిక్కంపుదూత, గాఁడు వీనిఁ బో నీకుఁడు కపులు వేగ
మగుడఁబట్టి తెం డనవుడు నెగిచి తెచ్చి, [3]పెలుచ నొప్పించుటయు వాఁడు భీతుఁ డగుచు.

210


చ.

ఇదె ననుఁ బట్టి తెచ్చి కపు లేపునఁ గాలను గేల బిట్టు నొం

  1. 'సావనమున' వ్రా. ప్ర.
  2. కలితాసృగ్ఝరు లాజ్య. అ. ప్ర.
  3. పెనఁచి నొప్పించుటయు