పుట:భాస్కరరామాయణము.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

[1]మాయావిద్యల నెవ్వఁడుం దలఁపఁగా మారీచ నీయంతవాఁ
డీయబ్జాననసృష్టి లేకునికి నిన్నేఁ బంచెదన్ రాఘవా
పాయం బేగతి మేదినీతనయకుం బాటిల్లు నవ్వంచనో
పాయం బొక్కఁ డొనర్తుగాక యన మే నాకంపముం బొందఁగన్.

288


క.

హృదయ మదరంగ సంధులు, ప్రిదులఁగఁ జిత్తము గలంగఁ బెంజెమ టొదవం
బెదవులు దడుపుచు నాదశ, వదనునితోఁ గొంతవడికి వాఁ డిట్లనియెన్.

289


శా.

పుణ్యుం డూర్ణితశౌర్యధైర్యమహిమస్ఫూర్తిస్ఫురద్వైభవా
గణ్యుం డార్యజనానురంజితమహాకారుణ్యుఁడున్ శ్లాఘ్యసౌ
గుణ్యుం డన్వయవార్ధిచంద్రుఁడు రిపుక్షోణీశ్వరస్థాపితా
రణ్యుం డార్తశరణ్యుఁ డుజ్జ్వలయశోరమ్యుండు సౌమ్యుం డిలన్.

290


క.

మతివిజితసురాచార్యుఁడు, చతురత్వచతుర్ముఖుండు సదమలవృత్తా
[2]యతపంకజలోచనుఁడును, శ్రితవినుతగుణప్రథాధురీణుఁడుఁ బేర్మిన్.

291


మాలిని.

వితరణఖని యుద్యద్వీర్యశౌర్యప్రభావో
న్నతుఁడు భుజబలాత్యున్మాదవిద్విడ్ధరిత్రీ
పతిహరణసమిద్భూభాగగమ్యుండు సంభా
వితపరిణతచిత్తోర్వీసురుం డుర్వి నెందున్.

292


గద్యము.

ఇది సకలసుకవిజనప్రణుతయశస్కర భాస్కరప్రణీతం బయినశ్రీరామా
యణంబునందు నారణ్యకాండంబునం బ్రథమాశ్వాసము.

293
  1. తే. ఎన్నివిధముల నైన నయ్యిగురుఁబోఁడి, నాకుఁ జేరునుపాయంబు నీకు నెట్లు
           పోలు నట్లుగ నొనరించి భూపసుతుల, మొఱఁగి మాతుల యెంతయుఁ దెఱఁగుపఱుపు.
    క. అనినం జిత్తము జల్లనఁ, దనమదిలోఁ గలఁగి వణఁకి దనుజేశ్వర రా
        మునివిక్రమంబు నీకును, వినిపించెద నున్నరూపు విను తెలియంగన్.
  2. యతచిత్తపంకజుఁ డా, శ్రితరక్షణగుణమహాధురీణుఁడుఁ