పుట:భాస్కరరామాయణము.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నాకు వినఁగ ననినఁ గాకుత్స్థుఁ డున్నరూ, పెఱుఁగఁజెప్పె నెల్లతెఱఁగుఁ దెలియ.

136


క.

విని నీవు నిన్నుఁ జెప్పితి, నను విను మెఱిఁగింతు ననుచు నరవరుతో న
ద్దనుజాంగన యి ట్లనుఁ దన, కనుఁగొనలం గలికిచూపుగమి పొలుపారన్.

137


చ.

బలిమి జగత్త్రయంబుఁ బలుబాములఁ బెట్టుచు దేవతావళుల్
పెలుకుఱఁ బంక్తికంఠుఁ డనుపేరఁ దనర్చిన దైత్యభర్తకుం
జెలియలఁ బేరు శూర్పణఖ చెప్పెడి దేమి మహీశ నీకు నేఁ
గలసితి నిన్నుఁ దక్క నొరుఁ గైకొన నీవును బాయు మీసతిన్.

138


తే.

తనరు నిచ్చేరువన జనస్థాన[1]మున ఖ, రాసురుఁడు మత్సిహోదరుఁ డధికసేన
తోడ నున్నాఁడు నను నీవు గూడియున్న, నతఁడు నినుఁ గాచు వేడ్క వియ్యంబ వనుచు.

139


క.

కొఱమాలినదుర్లక్షణ, కొఱ గా దిది నీకు నాలె గుత్తంబుగ ని
జ్జఱభి వధించెద నీతో, నఱ లేనిమనోజకేళి నలరెద నెలమిన్.

140


చ.

ఇది ననుఁ బోలునే వెడఁగ యే నినుఁ బొందినఁ బెక్కురూపులన్
మదనకళాకలాపము లమందగతిన్ వెలయింతు దీని మ్రిం
గెద నిటు సూడుమీ పిడపఁ గేళికిఁ జొచ్చినయప్డు మత్సుగ
ద్గదమధురోక్తులున్ హితరతంబును బంధవినోదగీతులున్.

141


క.

మన మిచ్చట నెచ్చో నై, నను గేళిం దేలవలయు నరవర తమ్ముం
డని చూడకు వీనిం బొరి, గొనియెద నేకాంత మొ ప్పగుం జతురతకున్.

142


చ.

అన విని యల్ల నవ్వి వసుధాధిపుఁ డద్దురితాత్మఁ జూచి యి
వ్వనితకు నేను గూర్తుఁ జెలువా సవతా లన నోర్తు గల్గునీ
మను విది యేల లక్ష్మణకుమారు వినిర్జితమారుఁ బొందు వే
చను సుఖ మందు నీకుఁ దగుజాణఁ డతం డని చూపి [2]వెండియున్.

143


క.

వరవర్ణిని యగునీకుం, బురుషుఁడు బలుదిట్ట యతనిఁ బొందుము లీలన్
సురధరణీధరము దివా,కరదీధితి పొందునట్టికరణిం దరుణీ.

144


వ.

అని యిట్లు చెప్పిన.

145


క.

నగ వవు టెఱుఁగక యిది యురి, తగులున సౌమిత్రిఁ జేరి దానవి దనకున్
మగఁడ వగు మనిన నాతఁడు, నగ వొదవిన నగక శూర్పకణఖ కి ట్లనియెన్.

146


చ.

త్రిజగములందు నేర్పులకు దిట్ట యనం దగురాముఁ డుండ వా
రిజముఖ బేల వై చెలువు రిత్తగ నవ్విభుదాసు నన్ను శు
ద్ధజడునిఁ బొంది నీవు నొకదాసివి గాఁ దలపోసె చేల స
ద్గజగతి నేఁగు మీసరసుఁ గన్గొని కైకొను నిన్ను నెమ్మెయిన్.

147


క.

ఈము క్కీచెవు లీమొగ, మీమెలుపుం బొలుపుఁ గలదె యేచెలువకు నీ
కోమలిక మెఱుఁగుటకునై, రాముఁడు మెలఁగించి చూచె రమణీ నిన్నున్.

148
  1. మనఁగ, నదె ఖరాసురవరుఁడు దా నధిక
  2. ' చెప్పినన్.
    క. నగ వగు టెఱుఁగక' వ్రా. ప్ర.