పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

భారత దేశమున

ఈ సంస్థానములకు విదేశ వ్యవహారములు చేసికొను . హక్కులులేవు. విదేశ ప్రభుత్వములతో గాని ఇతర సంస్థానములతో గాని ఎట్టి సంధి యొడంబడికలు చేసికొనవీలులేదు. బ్రిటిషు ప్రభుత్వము వారి అనుమతి లేకుండా ఐరోపాజాతీయులనుగాని అమెరికా జాతీయులనుగాని ఉద్యోగులుగా నియమింపరాదు. ఇతర రాజ్యములయొక్క వ్యాపార ప్రతినిధులను గూడ వీరుంచుకొనవీలులేదు. బ్రిటిషు ప్రభుత్వమువా రిచ్చిన బిరుదులు తప్ప విదేశీయ బిరుదులుగూడ స్వీకరింపరాదు. తన ప్రజలు విదేశములకు పోవదలచినచో తాను “ ప్యాసుపోర్టు" చీటినీయ వీలులేదు. ఇతరదేశములతో వ్యాపార సంబంధములు జరుపవలెనన్నచో బ్రిటిషు ప్రభుత్వముద్వారా జరుపుకొనవలెను. తనపట్ల నేరముచేసినవారి నెవరినైన తాను విచారించుటకు పట్టుకొనవలెనన్నచో బ్రిటిషు ప్రభుత్వము వారిని “ఎక్ స్ట్రాడిషను" చర్య జరుపుడని కోరవలెను. స్వదేశసంస్థాన ప్రజలు విదేశములలో బ్రిటిషు ప్రజలుగనే పరిగణింపబడుదురని మస్కట్ వారి సంధివలన 1873 లో స్థిరపడినది. స్వదేశస్థానములయొక్క సరిహద్దులు అంతర్జాతీయ ధర్మమున బ్రిటిషు సరిహద్దులుగా పరిగణింపబడును. అనగా సంస్థానమునకు వ్యక్తిత్వము లేదన్నమాట !

సంస్థానములలో నొండొరులకు గల తగవులు బ్రిటిషు ప్రభుత్వమువారివలన పరిష్కరించు కొనవలెను. స్వదేశసంస్థానములను సంరక్షించు బాధ్యత, . శాంతిభద్రతల బాధ్యత బ్రిటిషువారిదే గనుక వారికి సైన్యము లనావశ్యకములని