పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/807

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రిటీష్‌రాజ్యతంత్రము

317


IX బ్రిటీషు, భారతీయసైనికులకు ఉద్యోగులకు సాలు కగు ఖర్చులలో తేడాలు [1]

భారతదేశ సైన్యములోగల ఒక్కొక బ్రిటీషు సోల్జరు (ఆంగ్లేయసైనికుని) జీతబత్తెములకొరకు మనప్రభుత్వము ప్రతి సాలున చేయవలసివచ్చు ఖర్చు భారతీయసైనికుని కగు వ్యయముకన్న 1913 లోనే మూడురెట్లు హెచ్చుగానుండెను. 1922 లో నది నాల్గురెట్లు హెచ్చుఖర్చుగా పెరిగినది.

ఇట్లే బ్రిటీషు ఉద్యోగుల కగువ్యయము భారతీయుని కన్న ఆరురెట్లు హెచ్చుగనుండెను. ఒక్క బ్రిటీషు సైనికుని కగు ఖర్చు దరిదాపుగా భారతీయోద్యోగి కగు ఖర్చుతో సమానముగ నుండెను!

  1. ఇదియే 147 పేజీలో చెప్పబడిన పట్టిక (సి. ఎస్. వకీలుగారి లెక్క)