పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/759

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

269


వారి కుటుంబములకు ఉపకార విరాళములు; పింఛనులు

- విరాళములు పింఛనులు
చీఫ్ జస్టిస్ ప్రధానన్యాయమూర్తి కుటుంబముకు 17000 5000
సాధారణ న్యాయమూర్తుల కుటుంబముకు 13500 4000

పిల్లలకు ఒక్కొకరికి

తల్లికూడా లేకపోయినచో సాలుకు పింఛను 550 రూ.
తల్లి యున్నచో సాలుకు పింఛను 320 రూ.

V. ఐ.సి.యస్. వగైరా:-

పెద్దజీతములుగల ఆల్‌యిండియా (అఖిలభారత దేశ) ఉద్యోగవర్గములలో పూర్వము అన్నితరగతులవారిని ఇండియా రాజ్యాంగకార్యదర్శియే నియమించుచుండెను.ఆశాఖలలో ఐ. సి. యస్. పోలీసు, మెడికల్, ఇంజనీరులశాఖ విద్యాశాఖ వ్యవసాయశాఖ వెటర్నరీశాఖ మున్నగునవికలవు. 1924 మొదలు దీనిలో ఇంజనీరింగుశాఖలో రోడ్లు బిల్డింగుల బ్రాంచి యుద్యోగులను విద్యాశాఖ వ్యవసాయశాఖ యుద్యోగులను రాజ్యాంగ కార్యదర్శి నియమించుటమాని ఇండియా ప్రభుత్వమునకే వదలినాడు; తక్కినవారినతడే నియమించుచుండెను. ఇప్పుడీ క్రొత్తరాజ్యాంగము (1935) వలన పూర్వమువలెనే ఇకముందుగూడ ఐ. సి. యస్. పోలీసు మెడికలు సర్వీసుల యుద్యోగులను కేంద్రరాష్ట్రీయ మండలములందుగూడ