పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/678

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

188

భారతదేశమున


ప్రత్యేక జనసంఘముల జాతిమతభేదములు, అనవసరముగా అమితము లగుటయేగాక మధ్య తరగతి జన సామాన్యములో నొకభాగమునందు గల జాతిమతభేదములను అతితీవ్రముగా వర్ధిల్లునట్లు చేయబడినవి. ఇందువలన దేశములోని కుల కక్షల వ్యసనమును మరింతపెంచి కులకక్షలకు మతవైరములకు శాసనసభలను రంగస్థలములుగా చేయు పరిస్థితులు కల్పించినవి. నిజముగా వివిధమతములయందు జాతులందుగల స్వార్థపరులును దేశస్వాతంత్ర్యమునకు విరోధులును విజృంభించుటకును ఈమత వైరములను కులకక్షలను పెంచి జనసామాన్యముమీద పలుకుబడి సంపాదించుటకును ఈ ప్రత్యేక నియోజకవర్గములనుబట్టి వీలుకలుగును.

క్రింది సభయగు ఫెడరలు: అసెంబ్లీ సభకు రాష్ట్రశాసన సభలందలి ఆయా కులముల సభ్యులే ప్రతినిధుల నెన్నుకొను అప్రత్యక్షువు ఎన్నికపద్ధతి, పై సభయగు స్టేటు కౌన్సిలుకు ప్రజలుతిన్నగా ఎన్నుకొను పద్దతియు నిర్ణయింపబడుటకు నొక కారణముకలదు. సాధారణముగా రెండు శాసనసభలున్నప్పుడు జనసామాన్యము కొర కేర్పడిన మొదటిసభ ప్రజలచే తిన్నగా నెన్నుకొనబడు ప్రజాప్రతినిధుల సభగా నుండవలెననుటయు భూస్వాములు, వ్యాపారులు, ఇతర తరగతుల కొరకు ఏర్పడిన రెండవ సభకు ఆ యాతరగతి జనులుగల నియోజకవర్గములో వారి ప్రతినిధులలో ఎన్నుకొనవచ్చుననుటయు లేదా ఇంగ్లాండులోవలే ఎన్నికలులేకుండానే ప్రభువుల సభయే కావచ్చుననుటయు రాజనీతిశాస్త్రములో నొక