పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/674

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

184

భారతదేశమున


వారియొక్కయు, బర్మావారియొక్కయు వస్తువులకు బాధకరముగను విచక్షణ చూపునట్లుగను సుంకములు విధించకుండ జూచుట, భారతదేశ సంస్థానాధిపతులయొక్క హక్కులను కాపాడుట, ఇవన్నియు గవర్నరు జనరలుయొక్క ప్రత్యేక బాధ్యతలకు సంబంధించిన విషయములుగా 12 వ సెక్షను శాసించుచున్నది. ఈ విషయములందెల్ల గవర్నరు జనరలు తన స్వతంత్రవివేచననే ఉపయోగించునుగాని, మంత్రులతో ఆలోచించి పనిచేయడు. ఇట్లు ఆర్థిక నీతియావత్తు గవర్నరు జనరలు హస్తగతము చేయబడినది. ఈ విషయములపైన మంత్రులసభకు ఎట్టిఅధికారమునుండదు. ఈవిషయముల కొరకు గవర్నరు జనరలు ముగ్గురు 'కౌన్సెలర్లు' అనబడు సచివులను నియమించును. వీరిజీతిములును ఉద్యోగఫుషరతులును సభాయుతుడగు ఆంగ్లనృపాలుడు నిర్ణయించునని 11 వ సెక్షనుయొక్క 2 వ ఉప నిబంధన విధించుచున్నది.

ద్రవ్యసంబంధ విషయములందు అధికారములు చలాయించుట కొక "ఫైనా౯షల్ అడ్వైజరు"ను గూడ గవర్నరు జనరలు నియమించును. ఈఉద్యోగి ఫెడరలు శాసనసభలకు జవాబుదారీ వహింపడు. ( 15వ సెక్షను ). ఈకౌన్సెలర్లును ఫైనాన్‌షల్ అడ్వైజరును ఇంగ్లాండులోని రాజ్యాంగకార్యదర్శి చెప్పినట్లే వ్యవహరింతురుగాని మనమంత్రులమాట వినరు (14 వ సెక్షను). మంత్రులను పేర్కొనుటలోనేగాక వారి నుద్యోగమునుండి తొలగించుటలోను, వారి జీతములు నిర్ణయించుటలోను గూడ గవర్నరు జనరలు తన స్వతంత్రవివేచన నుప