పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/610

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

భారతదేశమున


కొన్ని హెచ్చుజీతములుగల ఉద్యోగములుగూడ నుండెను. రూ 1500 లు కూడా జీతముకల ఉద్యోగములున్నవి. దీనిలో మద్రాసులో 1877-78 లో 1980 మంది యుండిరి.

తాబేదారీనౌఖరులు:

ఈసామాన్య ఆన్‌కవనెంటెడ్ సర్వీస్‌క్రింద కొద్దిజీతగాండ్రు చిన్నఉద్యోగులు నౌకర్లుకలసి మద్రాసు రాజధానిలో ఒకలక్షమంది యుందురు. వీరిలో గ్రామోద్యోగులు నౌకరులు ఇతరులు నుందురు.

X

పెద్ద ఉద్యోగములు, వాని జీతములు.

"1892 లో పార్లమెంటువారు తయారు చేయించిన లెక్కప్రకారము భారతదేశములోని ఐరోపాజాతి యుద్యోగులజీతములక్రింద మనదేశప్రభుత్వ మిచ్చినసొమ్ము:

(1) సర్వీసులోనున్న ఆఫీసర్లకుజీతములు పౌనులు 8771443
(2) సెలవుపైనున్న ఆఫీసర్లకు పౌనులు 463631
(3) ఇండియాలోని ఆఫీసర్లకు పింఛనులు పౌనులు 232888
(4) రైల్వేసర్వీసులోని ఆఫీసర్లకు పౌనులు 806284
- వెరసి పౌనులు 10274246

గమనిక - i. ఈలెక్క పౌను 1కిరూ10లచొప్పున లెక్కగట్టిచూచినారుగాని 1900 నాటికి పౌనువిలువ రూ15 లకి పెరిగినందున ఇంకా 50 లక్షలు దీనికిచేరవలెను.