పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/595

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

105


పరిష్కరించుచుండును. క్యానింగుకాలములో ప్రభుత్వశాఖల పరిపాలనము ఐరోపాలోనిరాజ్యముల మంత్రిమండలి (క్యాబినెట్టు) పద్ధతి ప్రకారముగా అచ్చటిమంత్రుల కేయే అధికారములుండునో ఈసభ్యులకు నాయాఅధికారము లుండునట్లు పరిపాలనశాఖలు విభజింపబడెను. ఈ సభ్యులపైన గవర్నరు జనరలు అదుపుఆజ్ఞలు పై పెత్తనము వహించియుండెను. ఈ ప్రభుత్వశాఖలు విదేశ, స్వదేశ, రివిన్యూ, వ్యవసాయ, శాసననిర్మాణ, ఫైనాన్సు, పబ్లికువర్క్సు, వాణిజ్యపరిశ్రామిక, సైనిక , మిలిటరీ శాఖలుగా విభజింపబడినవి. విదేశ వ్యవహారములు గవర్నరుజనరలే చూచుచుండెను. దీనిలోస్వదేశసంస్థాన వ్యవహారములు చేరియుండును.

IV

రాష్ట్రీయ పరిపాలన

బ్రిటిష్ ఇండియాలో 8 పెద్దరాష్ట్రము లుండెను. మద్రాసు బొంబాయి రాజధానులొక్కొక గవర్నరు క్రిందను బెంగాలు, సంయుక్తరాష్ట్రము, (ఆగ్రా, అయోధ్య) పంబాబు, బర్మా, తూర్పు వంగరాష్ట్ర ము, అస్సాములు ఒక్కొక లెఫ్ట్‌నెంటు గవర్నరు క్రిందను తక్కిన చిన్నభాగములగు పశ్చిమోత్తర పరగణాలు, బెలూచిస్థానము, కూర్గు, అజ్మీరు, మేర్వారు, అండమానులు కమిషసర్లక్రింద నుండెను. ఈ ప్రభుత్వము లన్నియు గవర్నరు జనరలు చెప్పినట్లు నడువవలెను.