పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/570

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

భారతదేశమున


ధనప్రవాహము సాలుకు అన్ని రూపములుగానుకలసి 304 కోట్ల రూపాయిలుఅని అంచనా వేయబడినది.

వ్యాపార సంబంధమైనట్టియు, వృత్తిసంబంధమైనట్టియు విజ్ఞానప్రద మైనట్టియు విద్యనభివృద్ధిచేయుటకు ప్రభుత్వమువా రుపేక్షించినందువలన ప్రజ లజ్ఞానమున మునుగుటయు, ఆర్థికాభివృద్ధి కలుగకపోవుటయు, క్రొత్తపరిశ్రమలు వృద్దిగాక పోవుటయు తటస్థించి ఆర్థికక్షయముకలుగుచున్నది. మఱియు నింగ్లాండులోని జనులకు దినమున కొకనికి 4 రూప్యముల దామాషా ఆదాయము వచ్చుచుండగ మనదేశమున నొకని కొకదినమునకు ఒక అణా తొమ్మిదిపైసలే దామాషా ఆదాయముగ నున్నది! ఇంతియె కాదు. అజ్ఞానమువలనను, నివారింపబడనందువలన పెరుగుచున్న అనారోగ్యమువలనను, ప్రజల దామాషా ఆయుర్దాయము కూడ క్షీణించి మరణ సంఖ్యయు వృద్ధియగుచున్నది. ఇతర దేశములందు దామాషా ఆయుర్దాయము 40 సంవత్సరములై యుండగ మనదేశమున 23 సంవత్సరములు మాత్రమే!

భరతఖండమునకు ఆర్థికస్వాతంత్ర్యముగల సంపూర్ణ స్వరాజ్యము కలిగినగాని ఈ ఘోరాన్యాయములు తొలగవని దాదాభాయి నౌరోజీ నాటినుండి లజపత్ రాయిగారి నాటివరకు భారతీయ నాయకులెల్ల రుద్ఘోషించినను బ్రిటీషువారు పెడచెవిని బెట్టిరి.

భారతదేశ దారిద్ర్యమును బాఫుటయే కాంగ్రెసుయొక్క ప్రధానోద్దేశ్యము అందుకొరకే కాంగ్రెసు ఈ 50