పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/511

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

21


వలసినదని బ్రిటీషుప్రభుత్వమునకు తెలుఫుచుకూడ తీర్మానములు గావింపబడెను. ఇట్లు భారతదేశ జాతీయతత్వము బ్రిటీషుసామ్రాజ్యతత్వముతో బ్రిటీషురాజ్యాంగధర్మపద్ధతులతోనే పోరాడు నవీనయుగము ప్రారంభమైనది. బ్రిటీషు రాజ్యతంత్రమును ఎదుర్కొనిన శక్తులలో కాంగ్రెసుశక్తి మహాశక్తియనియు ఇక నీబ్రిటీషురాజ్యతంత్రముయొక్క ఆటలు సాగవనియు వెల్లడి యైనని. బ్రిటీషుప్రభుభక్తి పరాయణులయొక్కయు, స్వార్థపరులగు జాతిమతకుల పక్షములవారి యొక్కయు రోజులు దగ్గరించినవని భారతదేశజాతీయవికాసము నిక నెవ్వరు నాపలేరని కాంగ్రెసుప్రభుత్వము ప్రపంచమునకు వెల్లడించినది. నేడు కాంగ్రెసుయొక్క తేజము అప్రతిమానమై మహాత్ముని సారథ్యమున నిస్సందేహముగా నీస్వాతంత్ర్యమహాయుద్ధమున సంపూర్ణ విజయము గాంచగలదని స్థిరపడినది. బ్రిటిషుసామ్రాజ్యము వారు కాంగ్రెసు శక్తికి వెరగందినారు. రాజప్రతినిధియు గవర్నరులును కాంగ్రెస్ తేజమును చూచి ఆశ్చర్యపడినారు. భారత దేశమునందు ఐరోపావాసులును ఆంగ్లేయ సంఘములవారును వీరి పత్రికరాజములను ఈ కాంగ్రెసు మంత్రులయొక్క ప్రభుమంత్రోత్సాహ శక్తులను జూచి మెచ్చుకొన్నారు. పూర్వపు స్వార్థపరుల ప్రభుత్వమునకును నేటి స్వార్థత్యాగుల ప్రభుత్వమునకును గల - తారతమ్యమును చూపి బాగుబా గనినారు. ఇట్లు శాసనసభా ప్రవేశము అధికారస్వీకరణము కాంగ్రెసు బలమును తేజమును ఇనుమడింప జేసినవి. కాంగ్రెసు పరువు ప్రతిష్టలు