పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/499

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

9


శాశ్వతముగా నొక్కచోటనే పరివేష్టించి కేసులు విచారించ వలసిన స్టేషనరీ మేజస్ట్రేటు గుడివాడ తాలూకాలో పోలీసు డిప్యూటి సూపరెంటెండెంటు ఆజ్ఞకుబద్ధుడై ఊరూరదిరిగి లాటీ ప్రయోగముల కనుజ్ఞనిచ్చుటయేగాక తన కోర్టుకు చాల దూరమున నింకొక గ్రామములో కేసు విచారణచేసినాడు. ప్లీడర్లను రానీయలేదు. అంతట హైకోర్టువా రీతనిని తీవ్రముగా మందలించినారు. నాడు పీనలు కోడ్డులో చెప్పబడిన పూర్ణశిక్షను విధించుటయు పూర్తిజరిమానాను విధించుటయు సామాన్యమైనది. జమ్నాలాల్ బజాజి, డాక్టరు పట్టాభి సీతారామయ్యగార్ల వంటి వారిని "సి" క్లాసులో నుంచుచుండిరి. భూలాభాయి దేశాయిగారికి 10 వేలు జరిమానాయు పోలాపూరులో నొకరికి 30 వేలు జరిమానాయు విధింపబడెను. నాడు మేజస్ట్రేటు కోర్టులందు కాంగ్రెస్ శాంతి సైనికులను నాయకులనుఆ అధికారులు తీవ్రముగా శిక్షించుటేగాక దుర్భాషలాడుట ఇతరవిధముగా అవమానించుటయుకూడ జరిగినది. నాయకు లోర్చికొనిరిగాని కొందరు సామాన్యులు ఎదురు జవాబులుచెప్పిరి. కొన్ని ఉదాహరణములు నాకు జ్ఞాపకమున్నవి : మంచివాడును దివ్యజ్ఞానియనియు పేరుపొంది వృద్ధిలోనికి వచ్చుచున్న ఒక బాహ్మణ డిప్యూటీకలెక్టరు గారొక శాంతిసైనికుని భీమవరంలో విచారించుచు నీ తండ్రి పేరేమని యడిగిరి. ఆయువకుడు "మహాత్మాగాంధి" యని జవాబు చెప్పెను. అంతట నీ సద్ధర్ముడగుకలెక్టరుగారు 'గాంధీ నీ యమ్మ మొగుడా?' యని అడిగిరి. ఆ యువకుడు రోషావేశముతో