పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/482

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

ముస్తఫాలీకూడా అబద్దపు సాక్ష్యమిచ్చెనని ఆ కేసు విచారించిన సబుకలెక్టరు బాలకృష్ణయ్యరు ఐ. సి. ఎస్. గారు వ్రాసి డాక్టరుగారిని విడుదలచేసినారు. తరువాత నీ అబద్దపు కేసుపెట్టినందుకు ముస్తఫాలీచేత జిల్లాకోర్టువారు డాక్టరుగారికి నష్టపరిహారమిప్పించిరి. హైకోర్టులోకూడా ముస్తఫాలీ యబద్ధము స్థిరపరచిరి. అమలాపురములో నింకొక కేసును డాక్టరుగారిమీద దాఖలు చేయించి 6 నెలలు శిక్ష విధించిరి. చెరసాలనుండి ఈయన బయటకు వచ్చినపిదప మహాత్ముని హరిజనోద్యమము సందర్భమున 1933 లో సీతానగరములో నీయన ఒక హరిజనాశ్రమము స్థాపించిరి. తరువాత, తమ సత్యాగ్రహాశ్రమము వశముకాగా పోలీసువారుచేసిన భీభత్సమునెల్ల చక్కజేయుట కెంతోసొమ్ము కావలసివచ్చెను. ఆర్థికమాంద్యము కలిగినది. అయినను రాత్రింబవళ్లు కష్టపడి ఆశ్రమమును పునరుద్ధరించిరి. ఇట్టిస్థితిలో గాంధిమహాత్ముడు మఱల నొకమారువచ్చి ఆశ్రమమునుజూచి నిట్టూర్పునూర్చినారు. ఇట్టి నిరంతరసేవవలన తీవ్రమైన లాటీదెబ్బల వలన ఆరోగ్యము చెడి క్షయవ్యాధిపీడితులై డాక్టరుగారు 28-12-1936 వ తేదీన స్వర్గస్థులైనారు.

సుబ్రహ్మణ్యముగారి మరణమునుగూర్చి తెలియగానే ఆసమయమున జరుగుచుండిన కాంగ్రెసు నగర