పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హోంరూలు - స్వరాజ్యోద్యమము

377


స్వాతంత్ర్యోద్యమమును అణచుటకును ప్రజాభిప్రాయము నణగద్రొక్కుటకును ఎన్నో నిషేధాజ్ఞలను నిర్బంధములను ప్రయోగించిరి. ఆనీబిసెంటును ఆమె అనుచరులను నిర్బంధించిరి. అంతట సర్ సుబ్రహ్మణ్యఅయ్యరుగారు తమ అసమ్మతినిదెలుపుటకు 'సర్ ' బిరుదును వదలుకొనిరి. ప్రభుత్వమువారు 143 పత్రికలను బెదరించగా నవి భయపడిపోయెను. ఈ సందర్భమున 3 పత్రికలును 13 ప్రెస్సులును తమ ధరావతులను కోల్పోయెను.

ఐరోపా మహాసంగ్రామముయొక్క ఉద్దేశములోకమునందలి చిన్న జాతులయొక్క స్వాతంత్ర్యము కాపాడుటయని ప్రకటింపబడుటయు అన్నిజాతులు తమ యిష్టానుసారము స్వాతంత్ర్యముగా నుండవలెనను స్వయంనిర్నయ సూత్రమును, విశేష ప్రచారములోనికిరాగా భారతదేశీయులకు గూడ కొంతఆశ కలిగెను. ఐరోపామహాసంగ్రామములో భారతీయయోధులును సైనికులును చూపిన ధైర్యసాహసములు ప్రజలలో జాతీయభావమును వర్దిల్ల జేసెను. రష్యాఓడిపోయి విప్లవమున మునిగియుండగా జర్మనీవారు ముందుకు వచ్చుచుండగా ఆవిపత్సమయములో ఐరోపామహాసంగ్రామమున ధనము సైన్యము అమితముగా కావలసివచ్చెను. ఆ సందర్భములో బ్రిటిషుప్రభువులు తమ జాతీయ గర్వమును విడచి భారతదేశప్రజలతోను సంస్థానాధీశులతోను ఆలోచనలుసలిపి వారిసహాయమును గోరిరి. సంగ్రామ సమాలోచనలందును 1917-18 లలో జరిగిన సామ్రాజ్య కార్యాలోచన సభలందును మంత్రిమండలి సభలందును కూడ భారతదేశమునకు ఒకస్థాన మొసగబడి భారతదేశప్రభుత్వ ప్రతినిధులను సంస్థా