పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతదేశమున

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

తృతీయ భాగము

ఇంగ్లీషు దొరతనము : సామ్రాజ్యతత్త్వము

1858–1937

మొదటి ప్రకరణము

జాతీయ చైతన్యము

I

సిపాయిల విప్లవమువలన కలిగిన రాజకీయ ఫలితములలో దేశప్రజల స్వాతంత్ర్య స్వత్వములకు, ప్రజాభిప్రాయ ప్రకటనకు భంగకరమగు "ప్రెస్సుఆక్టు" అనబడు ముద్రణ శాసనము చేయబడుటయొకటి. భారతదేశ స్వాతంత్ర్యోద్యమము సరికట్టుటకే యిది చేయబడినది. ఈ యభిప్రాయముతోనే ఇరువదేండ్ల తరువాత గవర్నరుజనరలుగావచ్చిన లిట్టను దేశభాషలలోని వార్తాపత్రికలనునిరోధించు శాసనము జేసినాడు. ఇంకను అనేక స్వాతంత్ర్య నిరోధకశాసనములు చేయబడినవి.

విప్లవము నణచివేయుటకై సైనికవ్యయము 40 కోట్ల రూపాయిలుగా అంచనావేయబడిన యాభారము, కంపెనీవారితర యుద్ధములకొరకుచేసిన ఋణభారము, భారతదేశ ఆదా