పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

318

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


నుండెననుటకు సందియము లేదని పాశ్చాత్య చరిత్రకారులే ఒప్పుకొనియున్నారు. ఈ విప్లవబీజములు వంగరాష్ట్రము నందలి సిపాయిలలో నత్యధికముగా నుండెను. తమశక్తివలననే ఈ భారత దేశమునెల్ల ఈ తెల్లవారు పరిపాలించుచున్నా రనియు తాములేనిచో వారు అసహాయులగుదురనియు వారి యూహ. వీరిలో చాలమంది అయోధ్యనుండి వచ్చిన ఉత్తమ జాతిహిందువులు. వీరు స్వధర్మ స్వదేశములపై సభిమానముగలవారు. ఈ సమయమున పదభ్రష్టులైన రాజులు, వీరివారసులు, రాణులు నీయసంతృప్తిని అవకాశముగా తీసుకొనిరి. వీరికి పింఛనులుండుట వలన చేతిలో పుష్కలముగా సొమ్ముండెను. ఈ విజాతీయ కంపెనీవారి నెట్లు దేశమునుండి వెడలగొట్టుదుమాయని వీరు తీవ్రముగా ఆలోచించిరి. ఆనాడు ఆంగ్లేయులు క్రిమియన్ యుద్ధమున పరాజయము పొందుచున్నట్లు వీరు వినియుండిరి. రష్యా ఇంగ్లాండువారికి ప్రబలశత్రువనియు ఈ జాతిని అణచి వేయగలదనియు తలచిరి. మరల నొకమారు హిందుస్థానమును మొగలాయి చక్రవర్తిక్రిందికి తేవలెనని ఆతనియభిమానులును, హిందూరాజ్యమును స్థాపించవలెనని హిందువులును, లోలోపల ఆలోచనలు చేయసాగిరి. అంతట నీవిప్లవభావములనెల్ల నేకోన్ముఖమునకు నడుపశక్తిగల ప్రతిభాశాలురగు విప్లవనాయకులు బయలుదేరి ఈవిప్లవమునకు దోహదముజేసి వలసిన వ్యూహములనెల్లపన్ని విప్లవాగ్నికి చిచ్చు ముట్టించి భారతదేశమున విదేశపరిపాలనము నంత మొందింపదలచిరి.