పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశోద్ధరణ ప్రయత్నములు

309


బోర్డుఆఫ్ కంట్రోలుకార్యదర్శికి నివేదిక నంపిరి. తనస్నేహితులకు భారతదేశమును గూర్చి తగు శ్రద్దవహించ వలసినదని లేఖలు కూడావ్రాసిరి. గాని ఇంత శ్రమపడినను కంపెనీవారి పాలనలోని అన్యాయములను మాన్పుటగాని కంపెనీ రాజ్యాధికారమును రద్దుచేసి తామే ప్రభుత్వము వహించుటగాని పార్లిమెంటువారు చేయలేదు. ప్రజలలో అశాంతి హెచ్చ సాగెను. కంపెనీ ప్రభుత్వమువారు ఈ అశాంతి నణచుటకును దీని నాయకులను ఏవిధముగ నైనను భయపెట్టి ఈ యుద్యమమునుండి విరమించునట్లు చేయుటకును ప్రయత్నింపసాగిరి. లక్ష్మీనర్సుగారు రాజద్రోహము చేయుచున్నట్లు అనుమానించుచు ఆయన నెల్లప్పుడు పోలీసులు వెంటాడునట్లుచేసిరి! ఆయన నేవిధముగానైనను పట్టుకొనవలెనని ఆయన యిచ్చిన యుపన్యాసములు నెల్ల జాగ్రత్తగా పరిశీలింపసాగిరి. వీలైనచో రాజద్రోహముక్రింద శిక్షింపవలెనని వారియూహ! ప్రభుత్వోద్యోగులును ఆంగ్లేయవర్తకులును ఏకమై ఆయన వ్యాపారమునకు నష్టము కలిగించుట కనేక విధములుగ బ్రయత్నించిరి. ఇట్లు ప్రభుత్వమువా రెన్నివిధములుగా భయపెట్టినను ఎన్ని యిబ్బందులు పెట్టినను ఆతనికి ఎంత నష్టము కలిగినను ఈ దేశభక్తుడు తన పట్టుదలను వీడక ఆవంతయైనను జంకక ద్విగుణీకృతోత్సాహముతో అతి ధైర్యముతో ఎప్పటివలెనే తన రాజకీయోద్యమ కార్యక్రమమును జరుపుచు ప్రజల హక్కుల కొరకు పోరాడుచుండెను. లక్ష్మీనర్సుగారు గొప్ప రాజకీయ సంస్కర్తయేగాని విప్లవకారుడు గాడు. 1857 లో