పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

276

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


మద్రాసులో 12498 గ్రామపాఠశాలలుండెను. 188650 విద్యార్థులుండిరి. ఇదియంతయు అడుగంటినది. ఇట్టిస్థితిలో ఎల్ ఫిన్ స్టను విద్యాభివృద్ధి సంఘమును స్థాపించ దలచి 1820 లో నొక మహాసభకు అధ్యక్షతవహించెను. ఆ సభకు 5000 పౌనుల విరాళమిచ్చి పుస్తకములు అచ్చు చేయుటకును బహుమతు లిచ్చుటకును దేశభాషలో విద్య నేర్పుటకును మార్గములను అవకాశమును కలిగించినాడు. పదునారేండ్లు చక్కగా పని జరిగినది. ప్రాథమిక విద్యనుగూర్చిన విచారణ జరుగగా 1832 లో 1705 పాఠశాలలను 35143 విద్యార్థులును బొంబాయి రాజధానియందున్నట్లు తేలినది. నాటికి బొంబాయి రాజధాని జనసంఖ్య 50 లక్షలు. నాటి మదరాసు రాజధానిలో రెండు కోట్ల యిరువదిలక్షల జనసంఖ్యకు నొక్కటే ఇంగ్లీషు పాఠశాల! బొంబాయిలో నిట్లు ఎల్ ఫిస్ స్టన్ గారి కృషివలన ఆంగ్లవిద్య అత్యం తాభివృద్ధిగాంచినది. ఎల్ ఫిస్ స్టస్ గారు ఉన్నత విద్యను అభివృద్ధి చేయదలచెను గాని కంపెనీ డైరెక్టరు లంగీకరింపలేదు. బొంబాయిలో నొక కాలేజీని స్థాపించి ప్రత్యేకముగ భారతీయోద్యోగులను పరిపాలనా పద్దతులందు తరిఫీదుచేయ దలచెను గాని వారంగీకరింపరైరి. విద్యాభివృద్ధి కొరకు అత డీక్రింది సూచనలను చేసెను.

"నేటివు" పాఠశాలల సంఖ్యను హెచ్చించి వారికి పుస్తకములను సరఫరాచేయుట, నిమ్నజాతులను ప్రోత్సహించుట, శాస్త్రవిజ్ఞానమును బోధించు సంస్థల నేర్పరచుట, దేశభాషలలో వైజ్ఞానిక నైతిక శాస్త్రగ్రంథములను రచి