పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిస్తులనిర్ణయము - వసూలు

251


నుండెను. ఈ శాశ్వత పైసలాలో ఊరుపేరులేని దళారీలకును ఎట్టిహక్కులులేని యిజారాదార్లకును వసూలుదార్లకును భూమియందు శాశ్వతహక్కులిచ్చిరి. ఏ భూమితాలూకు శిస్తు ఎవడు సరాసరికంపెనీ ఖజానాకుతెచ్చి చెల్లించునో ఆ భూమికి వాడే శాశ్వతహక్కుదారుడని నిర్ణయించిరి ! ఇందువలన రైతుల కన్యాయము జరిగినదనుటలో నాశ్చర్యమేమి?

శిస్తులయొక్క రేట్లకు నీతినియమములుగాని నిలుకడగాని లేవు. తరములకు స్థిరత్వములేదు. భూమిలో పండు నికరపంటలో సగము పంటను శిస్తుగా పుచ్చుకొనుటకు తమకు హక్కుకలదని ప్రభుత్వమువారి యూహ. అది కొన్నిచోట్ల పూర్వము నూటికరువది వంతులుగను కొన్నిచోట్ల ఎనుబదివంతులుగనుగూడనుండెను. తరువాత సర్ తామస్ మన్రో పంటలో మూడవవంతు రొఖ్కరూపమున శిస్తుగా పుచ్చుకొనునట్లు శిఫారసుచేసెను. ఇదీగాక నీరుకావలసినను అక్కరలేకపోయినను నీటితీరువ తప్పదు. శిస్తులు క్రమక్రమముగా పెరుగుచునే యుండెను. రైతులకు వ్యవసాయఖర్చులును శిస్తును పోగా మిగులునది వారికుటుంబము మరుసటి సంవత్సరమువరకు జీవించుట కే చాలకుండెను. అందువలన భూములను బాగుచేసికొనుట యనునది కలలోనివార్త. భూసారము తగ్గిపోయిపంటలు క్షీణించుచుండెను. పాడిపంటలు బాగుగ లేనందువలన సంతత ధనక్షామమున రైతు బాధపడుచుండెను. రైతులు భరింపలేని పన్ను విధించి దానిని కఠినముగా అణాపైసలతో వసూలుచేయు పద్దతియే వారి దారిద్యమునకు గారణమని ప్రజల