పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

230

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


వాలిసు గవర్నరు జనరలుగా నుండినప్పుడు అత డనేక శాసనములు చేసెను. పార్లిమెంటు చట్టమిచ్చిన శాసన నిర్మాణాధికారముకన్న హెచ్చు అధికారముల నితడు చలాయించెను. నాటిశాసనములెల్ల క్రోడీకరింపబడెను.ప్రజల ఆస్తిని హక్కులనుగూర్చి చేయబడిన యీ శాసనములను పార్లమెంటువా రామోదించి అది భారతదేశములో ప్రధానకోర్టువారివలన రిజిష్టరు చేయబడగలందులకు ఉత్తర్వుచేసిరి. న్యాయవిచారణ కేర్పడిన కలకత్తా సుప్రీముకోర్టులోని న్యాయాధిపతుల సంఖ్య ఇద్దరికి తగ్గింపబడెను. తరువాత కొన్నాళ్లకు మద్రాసు బొంబాయిలలో రికార్డరుకోర్టులు స్థాపింపబడెను. శాసన నిర్మాణాధికారము మెల్లగా వర్ధిల్లెను. 1807 లో మద్రాసు, బొంబాయిల గవర్నర్ల కౌన్సిళ్లకు శాసన నిర్మాణాధికార మొసగబడెను. భారతదేశ ఆదాయము.లోనుండి ఇంగ్లాండుప్రభుత్వము కొంతలాభము పొందదలచెను. 1799 లో పార్లమెంటుచేసిన చట్టమువలన భారతదేశములో సుపయోగపడు సైన్యమునకు గావలసిన సైనికులకు బ్రిటిషు ప్రభుత్వపార్లమెంటు వారే తగు యేర్పాటుగావించుచు ఒకసైన్య పట్టికను తయారుచేసి కంపెనీవారు అర్జీ పెట్టుకున్నచో అందలి సైనికులను కంపెనీకి మార్చు నట్లు శాసింపబడెను. ఈ సైన్యముయొక్క వ్యయమును కంపెనీవారు భరింపవలెను. అట్టి సైనికులసంఖ్య 3000 లకుగాని, లేదా మ్యూటినీచట్టము నిర్నయించు సంఖ్యకు గాని మించరాదని నిర్ణయింపబడెను. కంపెనీవారు స్వయముగా 2 వేల కన్న హెచ్చు సైన్యమును చేర్చరాదు.