పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంగ్ల గవర్నరుజనరలుల దొరతనము

199


తెలుపగలందులకు మంత్రులకు లంచము లివ్వవలసినదని వ్రాసియేయున్నాను” అనినాడు ! పూనా రెసిడెంటగు క్లోజుకు (28-9-1803) వ్రాసిన లేఖలో పీష్వాయొక్క మంత్రులకు భారీగా లంచములిచ్చు విషయమును గూర్చి గవర్నరు జనరలు ఆలోచించుచున్నాడని వ్రాసినాడు! జనరల్ వెల్లస్లీ వ్రాసిన అఫిషియల్ డెస్పాచీ వలన బరహ౯ వూరుయొక్క పతనమునకు సింధియాక్రింద నుండిన ఐరోపా యుద్యోగుల యొక్కయు సైనికులయొక్కయు ద్రోహమే కారణమని బయల్పడినది. సింధియాక్రిందనున్న 'పేర్రా౯' అను నొక ఫ్రెంచి యుద్యోగిని గూర్చి మిల్లు తనచరిత్రలో వ్రాయుచు నితడు లంచము పుచ్చుకొన్నను తన యజమానునికి ద్రోహముచేసినచో చాలా పెద్దసొమ్ము లంచము వచ్చెడిదేగాని అతడు కొలువు మానుకొని పోయినాడని వ్రాసినాడు. 8-9-1803 తేదీని గవర్నరుజనరలుకు లేకుసేనాని వ్రాసిన రహస్యలేఖలో నతడు కేంగాకోటను పట్టుకొనుటకు లోపలివారికి లంచమిచ్చినట్లు తెలిపియున్నాడు. హోల్కారును నాశనము చేయవలెనని వెల్లస్లీ సంకల్పించెనుగాని వెంటనే అతనితో యుద్ధముచేయుటకు ఇష్టములేక పైకి స్నేహము నటించునట్లు లేకుసేనానికి వ్రాసెను. లేకుసేనాని వెల్లస్లీకి ఆప్తుడు. హోల్కారు బ్రిటిషువారికి వ్యతిరేకముగా కుట్రచేయుచున్న లేఖలు తన చేతిలో పడినట్లు ప్రకటించెను. వీనిలోకొన్ని ఫోర్జరీలని తేలినది. యుద్ధకారణము కల్పించుటకే యిది యిట్లు కల్పింపబడెను. వెల్లస్లీయొక్కకుట్ర లింగ్లాండుకు