పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వార౯ హేస్టింగ్సు ఘనకార్యములు

177


శిక్ష విధించెను. ఇతనిని శిక్షింతురని వారన్ హేస్టింగ్సుకు మొదటినుండియు తెలియును. ఇంకొక చిత్రమేమన, కూటసృష్టికి హిందూధర్మశాస్త్రమున లేనిఉరిశిక్ష క్రొత్తగా అమలు జరుపబడు ఆంగ్ల ధర్మముననుండెను. అందువలననే ఈ నేరమతనిపైన మోపిరి. నందకుమారుడు ధైర్యముతో ప్రాణముల బాసెను.

అయోధ్యరాణులు వజీరు అసఫ్‌ఉద్దౌలాయొక్క తల్లియు తండ్రితల్లియు చాలధనవంతులని ప్రఖ్యాతి. వారిదగ్గఱ 30 లక్షల నవరసులుండెననియు ఇంకను వారి కేటేట అమితమగు ఆదాయము వచ్చుచుండెననియు ప్రతీతి. వీరి ధనమును సంపదను కాపాడుదుమని వంగరాష్ట్ర ప్రభుత్వము వాగ్దానము చేసి యుండెను. అయిన నేమి? ఏ విధముగనో వీరి పనిబట్టి వీరి ధనము లాగివేయవలెనని హేస్టింగ్సు నిశ్చయించెను. కాశీరాజగు ఛయితుసింగు కంపెనీవారిపైన చేసిన కుట్రలో వీరికి సంబంధముకలదని వారన్ హేస్టింగ్సు వీరిపైన నొక నేరము మోపెను. ఇందుకు సాక్ష్యము లేనందున కోర్టులో విచారణపెట్టుటకు సాహసింపలేదు. అంతట పెద్దరాణి మనుమడును చిన్నరాణి కుమారుడును అగు అయోధ్యవజీరు క్రొత్త నవాబు అసవుద్దౌలా తన చేతిలో నుండినందున హేస్టింగ్సు. అతనిని లోబరచుకొని రాణుల ఆస్తినంతను లాగికొని వదలివేయునట్లు అతనితో నేర్పాటు చేసికొనెను. చిన్నరాణిని చెరలో పెట్టించెను. ఈ రాణుల జనానాలో నుండు ఖొజ్జావారి నిరువురను పట్టుకొని నిర్బంధించి తిండిపెట్టక మాడ్పుటయే గాక వారిని చిత్రహింసల జేయుటకు నవాబు నౌకరుల