పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్లైవు చూపినదారి

157


నల్లమందు ఇంకననేక వస్తువులను ప్రతి పరగణాలోను గ్రామములోను, ఫ్యాక్టరీలోను కంపెనీ గుమాస్తాలు క్రయవిక్రయములు చేయుచున్నారు. రైతులను వర్తకులను దౌర్జన్యముచేసి వారి సరకులను నాలుగవవంతు ధరలకు బలవంతముగా గైకొనుచున్నారు. తమ సరకులకు ఒక రూపాయి విలువచేయు వాని కైదురూపాయలు బలవంతముచేసి హింసించి పుచ్చుకొనుచున్నారు. ప్రతిజిల్లాలోని అధికారులును తమవిధిని నెరవేర్చుట లేదు. అందువలన నాకు రావలసిన ఆదాయము రాకుండ పోయి, సాలుకు 25 లక్షలరూపాయల నష్టము వచ్చుచున్నది. పరమేశ్వరానుగ్రహమున మన సంధిషరతులలో దేనిని నేను మీరలేదు . ఇట్టి స్థితిలో ఆంగ్లేయనాయకులు నా పరిపాలనమున కట్లు ఏల భంగము గలిగించి నన్ను నష్టపరచుచున్నారు?" అని 1762 మే నెలలో మీర్ఖాసీమొక లేఖవ్రాసెను.

ఆనాటి పరిస్థితులనెల్ల సార్జెంటు బ్రాగోకూడా తన లేఖలో వెల్లడించియున్నాడు. "ఒక ఆంగ్లేయ పెద్ద మనుష్యుడు తన గుమాస్తా నేదో సరకు నమ్ముటకో కొనుటకో పంపును. అంతట నీత డా వ్యవహారము కొఱ కేయాసామినైనను బలవంతముచేయుటకు తన కధికారము గలదను ధీమాతో బయలుదేరును, ఆయాసామి దాని కంగీకరింపనిచో నీగుమాస్తా ఆతనిని కొట్టి నిర్బంధించును. ఒకవేళ క్రయ విక్రయముల కత డంగీకరించినను అతని బాధలు తప్పవు. ఆ సరకులలో నితరు లెవ్వరు వ్యాపారము చేయకుండ బందోబస్తు జేయును. తమ ఆజ్ఞను మీరిన