పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

భారత దేశమున


వారి దానధర్మములవలన జరుగగల సత్కార్యములకు తాము పూనుకొనక పోవుట; అనగా నిరుద్యోగ నివారణ, దారిద్ర్య నివారణ, రోగనివారణ, విద్యాభివృద్ధి, పారిశ్రామిక ఆర్థిక అభివృద్ధి ప్రయత్నములు చేయకపోవుటయు నీ ప్రభుత్వపద్ధతిగా స్థిరపడెను. దేశముయొక్క శాంతిభద్రతలు కాపాడుటయె తమ పనిగాని దేశాభివృద్ధి చేయుట తమపని గాదని ఈ యంత్రము యొక్క ఊహ.

పాశ్చాత్య న్యాయశాస్త్ర ధర్మములు వ్యాపార ధర్మములు నీ ప్రాగ్దేశవు వ్యవసాయకులమధ్య గొప్ప విప్లవమును గలిగించెను. పూర్వమునాటి గ్రామ జీవనము సభ్యత మర్యాదలు నశించిపోవ సాగెను. వస్తుమార్పిడి పద్ధతిపోయి రొక్క వ్యాపారపు పద్దతివచ్చెను. 1861 లో క్రోడీకరింపబడిన సివిలు - క్రిమినలు ధర్మవ్యవహార విధులు సాక్ష్యస్మృతి వ్యాజ్యములందు గుంటచిక్కులు కల్పించి ఆంగ్లేయపద్ధతుల ప్రకారము అమలు జరుపబడ సాగెను. వివాదలోని నిజమెట్లున్నను గ్రామప్రజల ఆచార మెట్లున్నను మనస్సాక్షి కెట్లు తోచుచున్నను కేవలము 'లా పాయింటు' పైన కేసులను తీర్పు చెప్పు ఉన్నత న్యాయస్థానములు స్థాపింపబడి ప్రజలకు వ్యాజ్యములాడుటలో అభిరుచిని కలిగించి అప్పీళ్ళు చేయించి కక్షలు పెంచెను. 1860 తరువాత కొన్నాళ్ళు ధరలు హెచ్చగా రైతులు ధనవ్యయమున కలవాటుపడిరి. పెండ్లిండ్ల కర్మలకు విరివిగా ఖర్చుచేసిరి. 1870 తరువాత ధరలు మరల పడిపోయెను. అంతట హెచ్చు ఖర్చు కలవాటుపడిన రైతులు పొదుపు చేయ