పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

111


మును లేకపోయెను. మరియు సిపాయి విప్లవమువలన నేశాఖయు భారతీయులక్రిందనుంచి నడుపుట కిష్టము లేక పోయెను. ఇట్లు భారతదేశ పరిపాలనను కేవలము తెల్లవారి చేతులలోనే యుంచి నడుపుపద్ధతి ఐరోపాసంగ్రామము వరకు జరిగెను. 1913 లో నెలకు 800 కు పై బడిన జీతములుగల 2501 పరిపాలకోద్యోగములలో 2153 మంది తెల్లవారు 106 మంది ఆంగ్లోయిండియనులు 242 మంది భారతీయులు నుండిరి. దేశపరిపాలన ఐ. సి. ఎస్. శాఖోద్యోగులగు కలెక్టరులు జరుపుచుండగా వ్యవసాయము పబ్లికువర్క్సు అడవులు మొదలగు శాఖలును తుదకు కేవలము ప్రజల విద్యాభివృద్ధికొర కేర్పడిన విద్యాశాఖయు గూడా ఆంగ్లేయోద్యోగులక్రింద నుంచబడెను. అదివరకు సైన్యముయొక్క ఆరోగ్యరక్షణ కొరకు నిర్మింపబడిన శానిటరీ బోర్డులనేపెంచి 1864 లో "పబ్లికు హెల్తు” (ఆరోగ్య) శాఖగా మార్చి ఆంగ్లేయోద్యోగిక్రింద నుంచిరి. ఇట్లు పరిపాలనశాఖలపద్దతి “డిపార్టుమెంటలిజం" వర్ధిల్లి నేడు మనము చూచు మహాప్రభుత్వ యంత్రముయొక్క శాఖోపశాఖలు నిర్మింప బడినవి. ఈ శాఖందు కేవల మాంగ్లేయులే నియమింపబడ సాగిరి. అట్లు నియమింపబడిన ఆంగ్లేయు లెల్లరు ఆ యా శాఖల పనులు చేయుటకు తర్ఫీదు పొందిన వారుగాని నిపుణులుగాని సమర్థులు గాని కారు. వారు ఆంగ్ల జాతికి జెంది సీమనుండి వచ్చుటయే ప్రధాన యోగ్యతగా గలవారై యుండిరి. ఈ దూరదేశమున మండుటెండలో కష్టపడి పనిచేయుట కింగ్లాండులో పనిసంపాదించుకొను శక్తియు