పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

భారత దేశమున


సొమ్ము తానుపుచ్చుకొనక సైన్యములకు పంచిపెట్టినాడనియు టారెన్సు చెప్పుచున్నాడు. (Malcolm Vol. I. Torrens 230-248) వెలస్లీ కాలములోనే మరల సింధియా విషయములో కూడ నిట్టి బహుమతి ద్రవ్యమును గూర్చిన యేర్పాటు జరిగినట్లును వివరింపబడి యున్నది.

1836 ఏషియాటికు జర్నలు 33 పుటలో నీక్రిందిసంగతి వివరింపబడినది. కూర్గును కలుపుకొనునప్పుడు ఆ దండయాత్ర నడిపిన సర్. పి. లిండ్సేగారికి దోపిడిసొమ్ములో 16 వ వంతు ఒసగబడెను. దండయాత్రలో పాల్గొనిన ప్రతి యుద్యోగికి ఆ దోపిడిసొమ్ములోనుండి ఈ విధముగా బహుమతులు పంచిపెట్టిరి:

కర్నలు లొక్కొక్కరికి - 25 వేల రూపాయిలు

లెఫ్టి నెంటు కర్నలు లొక్కొక్కరికి - 15 వేల రూపాయలు

మేజర్లకు 10 - వేల రూపాయలు

కెప్టెనులకు - 5 వేల రూపాయలు

సబ్ ఆల్టర్నులకు - 25 వందలు రూపాయలు

ఈ అన్యాయమునుగూర్చి మొరపెట్టుకొనుటకు కూర్గు రాజు 1852 లో ఇంగ్లాండువెళ్ళగా అతని మొరలెవ్వరు వినక అవమానించిరి.

1826 లో భరతపుర సంస్థానముయొక్క బాలరాజును సంరక్షించుటకు పంపబడిన లార్డుకంబర్ మేర్ అచ్చట కోటలోని 48 లక్షలలో 6 లక్ష లపహరించెను. ఇంకను విలువగల సామానులు దోచుకొనెను. (తాంప్సన్, గెర్రాట్ పుట 297)