పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

81


బాగుపడును. అట్టి ఉద్యోగగౌరవము పొందువారు లేనప్పుడు తక్కువ తరగతుల ప్రజలయం దెట్టి సారము నుండదు. ఇట్లు ప్రజలకు ప్రభుత్వోద్యోగములు లేనందువలనిఫలితము లన్ని బ్రిటిషు పరగణాలలోను కనబడుచునేయున్నవి. ఈ జనులు కేవలము నీచమైన బానిసబుద్ధి కలవారుగా నున్నారు. సుబేదారుకన్న హెచ్చుసైనిక దర్జాగాని సివిలుపరిపాలనలో న్యాయవిచారణ శాఖలోను, రెవిన్యూశాఖలోను స్వల్ప జీతముల యుద్యోగములుకన్న హెచ్చుపదవినిగాని పొందలేని నేటివులలో నీతినియమములు వర్ధిల్లుట దుస్తరము. చాలీచాలని స్వల్పజీతములకు తోడు లంచములు పుచ్చుకొందురనుటలో నాశ్చర్యమేమియులేదు.

బ్రిటిషువారీదేశము నాక్రమించిన దానియొక్క ఫలిత మేమనగా నీజాతి నుద్దరించుటకు బదులు కేవలము పాడుచేయుటగనే పరిణమించినది. ఈబ్రిటిషు ఇండియాలోవలెజనులకు తమ దేశపరిపాలనలో నెట్టిపలుకుబడియు లేకుండాజేసిన నుదాహరణ మిం కే దేశాక్రమణ చరిత్రలోను జరుగలేదని చెప్పవచ్చును. (Life and Experiences -Sir P. C. Ray 227-228) స్ట్రాచీ గారు 1820 సంవత్సరమున చెప్పిన మాటలివి. “ఆంగ్లేయులకు దుర్బుద్ధి కలుగకుండా కావలసినంత పుష్కలముగ జీతములనిచ్చుచు 'నేటివుల'కు వారు ఎంతగొప్ప వంశీయుడైనట్టి మహనీయుని సంతతివారైననుగూడ వారికి పెద్ద యుద్యోగము లివ్వక నీచపు నౌఖరీనిచ్చి నెల కిరువది ముప్పది రూప్యముల భిక్షాదానపు వేతనముల నిచ్చి వీరు లంచగొండెలనియు