పుట:ప్రబోధచంద్రోదయము.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథయుగము కావ్యవిభజనము

ప్రబోధచందోద్రయ వరాహవురాణ కృతికర్తలైన నందిమల్లయ ఘంటసింగయకవులు తెలుగు సాహిత్యమున శ్రీనాథయుగమునకు జెందినవారు.

శ్రీనాథయుగము

ఆంధ్రవాఙ్మయచరిత్రమున క్రీ.శ. 1400-1500 అని నిర్ణీతమైనది. ఈ కవుల కృతులనుబట్టి వారు శ్రీనాథయుగమున చివరి రెండు దశాబ్దులలో ననగా క్రీ.శ. 1480–1500 ప్రాంతమున నుండెడి వారని చెప్పనగును.

ఆంధ్ర వాఙ్మయమున శ్రీనాథయుగ మొకవిశిష్టయుగము.యుగమున పద్యకవితయేగాక పదకవితయు వర్ధినది. శ్రీనాథుని సమకాలికులగు తాళ్లపాక అన్నమయ్య, తిరుపతి క్షేత్రమున శ్రీవేంకటేశ్వరునిపై వేలకొలది పదములు పాడినారు. ఆయన పదకవితాసార్వభౌముడు. ఇట్లు పద పద్యకవితాసార్వభౌము లిరువురును, సమకాలికులుగా నుండుట మన సాహిత్యచరిత్రమున నొక సంస్మరణీయమైన సన్నివేశము.

శ్రీనాథయుగమున పురాణములు, అనువాదకావ్యములు, కథాకావ్యములు, చారిత్రికకావ్యములు, క్షేత్రమాహాత్మ్యములు, శాస్త్రగ్రంథములు, ద్విపదకావ్యములు వెలసినవి, వానితోపాటు క్రీడాభిరామమను రూపకము వెలసినది. సంస్కృతనాటకములు పద్యకావ్యముగా నీ యుగమున వెలసినవి. పిల్లలమఱ్ఱి పినవీరన కాళిదాసు శాకుంతలనాటకము నందిమల్లయ, ఘంటసింగయ కవులు ప్రబోధచంద్రోదయనాటకము ప్రబంధానువాదములు గావించినారు.

శ్రీనాథయుగమున కృతులయందలి విభాగము పైనచెప్పిన పినవీరభద్రకవి శృంగారశాకుంతల పీఠిక (పుట 4) యం దిట్లుగలదు.[1]

“ఈయన (పిల్లలమఱ్ఱి పినవీరన) శృంగారశాకుంతలము శ్రీనాథయుగలక్షణములకు నిర్దుష్టమైన యుదాహరణము.

  1. శృంగారశాకుంతలము, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీవారి ప్రచురణ. పీఠికారచయిత డాక్టరు శ్రీమతి నాయని కృష్ణకుమారి, సంపాదకురాలు, 1967.