పుట:పల్నాటి చరిత్ర.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

పల్నాటి చరిత్ర


నిమ్మగా పూర్వదిశన్ బింగళిపురదక్షిణమున రంగుగ నెల కొన్న గోపరత్నంబునకున్ |

కం॥ సాయప వేంకటపతి భూ
     నాయక దత్తాగ్రహార నగర శాయత దేవా
     లయమున బాయక వ
     సియించు గోపభామాపతికిన్
     
కం॥ కేతవర నామపట్టణ
     ధైతేయాశా సమన్విత నికేతునకున్
     వాతాత్మజ తార్క్ష్య సుతా
     న్వీతునకు సమస్తలోకవిఖ్యాతునకున్
     
కం॥ శ్రుతశాస్త్రాగమ జితిగీ
     ష్పతి వట్టెము పెద్ద నార్య సంపాదిత పు
     ణ్యతరాగ్రహార పూర్వ
     క్షితిజ శమీయామ్యమున వసించినహరికిన్

అప్పకవి వేలకొలది గ్రంధముల బరిశీలించి లక్ష్యముల నుదహరించెను. రావిపాటి తిప్పరాజు (త్రిపురాంతక కవి; చాటుధార

మ॥ సరిబే సైరిపుడేల భాస్కరులు భాషానాధ పుత్రవసుం
    ధరయందొక్కడు మంత్రియయ్యె వినుకొండన్ రామయా మాత్యభా |
    స్కరుడో యౌనయినన్ సహస్ర కర శాఖల్ లేవవేయున్నవే |
    తిర మైదానము చేయుచో రిపుల హేతిన్ వ్రేయుచో వ్రాయుచో

వంటి రసవంతములగు పద్యములప్పకవి యుదహరించుట చేతనే నిలిచియున్నవి. రైళ్లుమోటారులు ముద్రణయంత్రములు లేని యారోజులలో ననేకప్రదేశములుతిరిగి యనేక వ్రాతప్రతులు పరిశీలించి వ్రాసిన అప్పకవి యెంతయో వందనీయుడు. ఆంధ్రవ్యాకరణమును'ఆంధ్ర శబ్దచింతామణి' యను పేర సంస్కృత శ్లోకములలో నన్నయభట్టు రచించెననియు దానిని విపులముగా లక్ష్యములతో పద్యరూపముగా రచించితిననియు యప్పకవి చెప్పికొనెను