పుట:పల్నాటి చరిత్ర.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

23

పల్నాటిలోని పిన్నిలికి పింగళియను నామముకలదు. అప్పకవి

క. తంగెడసీమను నిర్జర
   గంగాసమ నాగనిమ్నగా పూర్వదిశన్,
   పింగళిపుర దక్షిణమున
   రంగుగ నెలకొన్న గోపరత్నంబునకున్

అని పిన్నెలిని పింగలియని వ్రాసినాడు.

(2) ప్రభావతీ ప్రద్యుమ్నములో

ఉ. రంగుగ గౌతమీ పరిసరంబుల కృష్ణకెలంకులన్ ఘనుల్
    పింగళి రామయాదులు లలిం బలనాటను బాకనాటనున్
    బింగళి గాదయాదులిట పెంపు వహించిన యస్మదాదులా
    పింగళి గోకమంత్రి యిలు పేరనె చాల ప్రసిద్ధ లెల్లచోన్

అని తనవారు పలనాటిలో ప్రసిద్ధులైనట్లు వ్రాసికొనినాడు.

(3) ప్రభావతీ ప్రద్యుమ్నములో సూరన

ఉ. పేర్వెలయంగ నాఘనుడు పింగళి గోకబుధోత్తముండు గం
    ధర్వినొకర్తు బేకియనుదానిని దాసిగనేలె"

యని తనపూర్వుని గుఱించి వ్రాసినాడు. ఈపేకికథ పిన్నెలివారింటిలో నిప్పటికిని వంశ పరంపరగా చెప్పుకొనబడుచున్నది. పిన్నెలివారి పూర్వులలో కొకరింట పేకియను గంధర్వి మనుష్యవేషమున దాసిగానుండెననియు, దూరముగా నున్న దీపమెగసన ద్రోయు టకు సూతికాగృహముననున్న యజమానురాలిచే నాజ్ఞాపింప బడినదనియు, అది లేచుటకు బద్దకించి, యెవరు తనను జూడ లేపకదాయని తలచి, గంధర్వ మాయచే నాలుకను దీపము వఱకు నాచి ఎగఫన త్రోసెననియు దీనిని చూచిన యజమాను రాలు భయపడి భర్తలో చెప్పి దాసిని వెడలగొట్టించెననియు