పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

పద్మపురాణము


ఆ.

[1]వేదమాత గాఁగ వెలసిన గాయత్రి
భక్తియుక్తితో జపంబుసేయు
నతఁడు దురితవితతి నాక్షణంబునఁ బాసి
బ్రహ్మపదముఁ గాంచు భవ్యచరిత!

90


వ.

మఱియు దజ్జపంబు నరులకు వాఙ్మనఃకాయంబులగు దోషంబు
లణంచు నేమంత్రంబులును గాయత్రియందు శతభాగంబు
దొరయ నేరవు, మఱియును.

91


క.

ఱేపును మాపును వేల్చుచు
నేపున గాయత్రిఁ జిత్తమిడి వేదము ని
ర్లోపముగాఁ బఠియించిన
యా పురుషుఁడు బ్రహ్మలోక మనయము నొందున్.

92


క.

పరపాక పరాన్నంబులు
పరిహరణీయంబు లగుటఁ బరభోజన మె
ప్పరుసునఁ జనఁ దద్ద్రవ్యము
లిరవుగఁ దా దారఁగొని భుజించుట యొప్పున్.

93


ఆ.

ఎవ్వనింట నశన మెవ్వఁడు భుజియించు
వాని పాపమెల్ల వాఁడు నొందు
నట్లు గాన ధరఁ బరాన్నంబు వర్జింప
వలయు సుగతిఁ గోరువారికెల్ల.

94


తే.

అనఘ! మూఁడునెలల నొండె నాఱునెలల
నొండె [2]నెమ్మి ప్రాయశ్చిత్త మొనరఁజేయ
జనములకు వాఙ్మనఃకాయజంబులైన
యఘము లడఁగును యమపురి కరుగఁ డతఁడు.

95
  1. వేద మూఁత గాఁగ (మ)
  2. నేమి (ము)