పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

55


క.

మనమున మాటలఁ గర్మం
బునఁ బ్రాణుల హింస సేయఁబూనినవారల్
విను నరకముఁ బ్రాపింతురు
తనర నహింసయ విశేషధర్మం బరయన్.

63


వ.

మఱియు సకలవేదశాస్త్రవిదులు నహింసయె పరమధర్మం బని
చెప్పుదురు. మశకకీటకమత్కుణదంశకాదిహీనజంతువుల
రక్షించు పుణ్యాత్ములు నరలోకనిరీక్షణంబు సేయరు. జలచరస్థల
చరంబులగు జీవులం దమజీవనోపాయంబులకు వధియించు
వారలు కాలసూత్రప్రాప్తులై నిజశరీరమాంసభక్షణంబును రక్త
పానంబును జేయుచు నన్యోన్యపీడితులై యాక్రందించుచు నర
కాలయంబునం బెద్దకాలంబుండి యంత వెలువడి స్థావరంబులై
తిర్యగ్యోనిశతంబులం బుట్టి పిదప జాత్యంధులు వంగులు మూకులు
దరిద్రులునై [1]పుట్టుదురు గావునఁ బురుషుం డహింసాశీలుండు
గావలయు. నదులు సముద్రంబునం బ్రవేశించు చందంబున
సకలధర్మంబులు నహింసయందు వసియించు న ట్లగుటం జేసి
హింసకుం డుభయలోకసౌఖ్య [2]రహితుండు.

64


క.

విజితేంద్రియులై మనుజులు
నిజముగ వర్ణాశ్రమముల నిలిచిన వారల్
సుజనత్వంబున నెప్పుడు
నజలోకము నాశ్రయింతు రానందమునన్.

65


క.

[3] ఇష్టాపూర్తరతులును వి
శిష్టమతిం బంచయజ్ఞసేవకులును ను
త్కృష్టదయాత్ములు నతివి
స్పష్టయమాలయముఁ జూడఁ జన రెన్నటికిన్.

66
  1. పుట్టి పాపంబు లార్జింపుదు రటు గావున (హై)
  2. రహితుండని మునులు చెప్పుదురు (హై)
  3. ఇష్టార్థపూర్తరతు లు, త్కృష్టదయాత్ములును సుకృతదో (.)లు నతివి, స్పష్టమగు హేయరూపము. కష్టపు యమపురము వోవ గన రెన్నటిన్ (హై)