పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

45


క.

కంకణమణిమయనూపుర
ఝంకారము లులియ బిగువుచనుఁగవ నెఱయన్
జంకెలు గన్నులఁ దేఱఁగ
మంకెన కెంబట్టు మెఱయ మలయుచు వచ్చెన్.

14


వ.

అంత.

15


క.

అలకలతావికి నలికుల
కలకల ములియంగ వీణ గదలించుచుఁ దాఁ
గలికి కనుఁగొనల కొలకుల
నులుకులు దలకొనఁగ లలిఁ దిలోత్తమ యొప్పెన్.

16


ఆ.

అయ్యశోకవనమునం దెల్ల విహరించి
సుడిసి కమ్మతావి సోడుముట్టఁ
దరుణి విరుల నలరు సురపొన్న తరువెక్కి
వట్టిమ్రాఁకు లిగురువెట్టఁ బాడె.

17


వ.

అప్పు డద్దివ్యగానం బత్యంతమధురంబుగా వీతెంచిన నవ్వనం
బున విహరించుచున్న దనుజనాయకపరిచరవర్తులగు నసురు ల
య్యెలుంగులు విని చనుదెంచి తిలోత్తమం గనుంగొని చిత్తంబున
నుత్తలంబు గదురఁ బఱతెంచి శాతకుంభస్తంభవిలసితంబగు మణి
మండప[1]స్థలంబునందు.

18


క.

సుందరులు పసిఁడికోరల
నందీ నందంద యాని యాసవసౌఖ్యా
నందులగు నన్నదమ్ముల
మందుల సుందోపసుంద మనుజాశనులన్.

19


క.

కని వినయంబున మ్రొక్కుచు
ననుపమసంభ్రమము దోఁప నసురులు ధాత్రి
[2]న్విని కని యెన్నం డెఱుఁగము
సునిశితబలులార యిట్టిచోద్యము లెందున్.

20
  1. స్తంభంబునందు (ము)
  2. న్వినముం జూడము నెన్నడు (తి-హై)