పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

పద్మపురాణము


తే.

సతతగురుదేవతాపరిచారరతుఁడు
గుణసముద్రుఁడు కాశ్యపగోత్రజనితుఁ
డనఁగ నుతికెక్కి పెంపున నతిశయిల్లు
మదనసదృశుండు కందనమంత్రివరుఁడు.

44


ఉ.

మించిన కీర్తివాఁ డధిగమించిన నేరుపువాఁడు దర్పకున్
మించిన రూపువాఁడు సిరిమించిన కన్నులవాఁ డుదారత
న్మించిన చేతివాఁ డలరుమించిన చిత్తమువాఁడు ధాత్రి వీఁ
డంచు నుతింప నబ్బసచివాగ్రణి కందన పొల్చు నున్నతిన్.

45


వ.

మఱియును.

46


సీ.

ఈ ధర్మచారిత్రు నే ధాత్రిపతి యేలె
       నా ధాత్రిపతి యేలు నఖిలజగము;
నీ కామినీకాము నే కామినులు చూతు
       రా కామినులు చూడ రన్యపురుషు;
నీ యర్కసుతతుల్యు నే యర్థి గొనియాడు
       నా యర్థి యొరు వేఁడ నాసఁజేయఁ;
డీ మంత్రికులచంద్రు నే మంత్రి పురణించు
       నా మంత్రి విముఖాత్ముఁ డఖిలమునకు;


ఆ.

[1]ననఁ బ్రగల్భరూపఘనదాననయమార్గ
ముల నుతింప నొప్పు ముజ్జగములఁ
దారహారహీరధవళాంశుసమకీర్తి
కలితుఁ డౌబళార్యకందవిభుఁడు.

47
  1. ననఁగఁ బ్రాగల్భ్యరూపదాననయ, మార్గముల నుతింపంగ నొప్పును ముజ్జగముల - పూర్వార్ధము తేటగీతి, ఉత్తరార్ధము ఆటవెలది (ము)