పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-పంచమాశ్వాసము

213


వ.

అదియు నిశ్శ్రేయసంబు నిర్వాణంబు కైవల్యం బనంబడు నప్ప
దంబు కేవల సుఖదుఃఖవివర్జితులై శ్రీసతీశ్వరచరణారవింద
మకరందరసానుభవంబు లే కునికిం జేసి శూన్యంబగు నట్టి సుఖం
బల్పమతు లిచ్చగింతురు గాని మహాత్ములగు భగవద్దాసు లప్పదం
బొల్లక విష్ణుపదంబు ప్రాపింతు రది యెట్టి దనిన.

143


క.

నానాఘనవప్రముల వి
మానములం దోరణముల మణిసౌధముల
న్మానితమగు జనపదవృత
మై నెగడుం బరమధామ మతిరమ్యంబై.

144


ఆ.

అప్పదంబునడుమ నధికవిభూతితోఁ
దనరుఁదా నయోధ్య యను పురంబు
కనకకమలమధ్యకర్ణికాకారమై
యలరు దానిఁ బొగడ నలవి యగునె?

145


క.

సురచిరమణిఘృణియుతమై
గురుతరమగు నప్పురంబుకో టలరారున్
పరిణామవేళ భూసతి
కరకంకణ మూడ్చి యిడిన కైవడిఁ జూడన్.

146


తే.

చారుకురువిందమరకతచ్ఛాయ నిగిడి
దూరమునఁ గానఁబడు పురతోరణములు
మెఱయు నబ్జాక్షతమకాంతిమేఘపటలిఁ
దనరఁ బొడతెంచు సురరాజధనువు లనఁగ.

147


తే.

త్రవ్విచూచిన[1]నైన రత్నములె కాని
యన్యమగుఱాలు వొడగాన మప్పురమునఁ
దరువు లెల్లను సంతానతరులెకాని
మందునకు నైన నొండొకమ్రాను లేదు.

148
  1. మంచి (హై), నెచట (తి)