పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ సదాశివాయనమః

పండితచారిత్ర.

పీఠిక

అసంఖ్యాతనూతనపురాతనభక్తమాహేశ్వరపాదాభ్యాం నమః

శ్రీమచ్ఛైవరమావరున్ నియమితశ్రీచెన్నమల్లేశ్వరున్।
ధీమంతున్ న్నిగమాగమస్మృతిమతోద్గీతాఢ్యువేత్తన్ బుధ।
స్తోమస్తున్ ప్రభు నూర్ధ్వనేత్రు సుగుణాఢ్యున్ బండితారాధ్యులన్।
గావింతు న్నుతియింతు కొల్తు దలతున్ కామ్యార్థసంసిద్ధికిన్॥

మరియు బండితారాధ్యులచారుచరిత్రంబునందు గృతిపతినిరూపంబును భక్తప్రార్ధనయు కృతిఫలంబును గురుస్తోత్రంబును భక్తప్రశంశయు భక్తానుగ్రహణంబును కవీశ్వరనామంబును ప్రబంధకృత్యస్వీకారంబును నిజవీరవ్రతానుపాసనయు కావ్యకళానుక్రమిణకయు కవిత్వలక్షణంబును ఆరాధ్యగురుపరంపరయును ఆరాధ్యసముద్భవంబును వారు విప్రులతో వివాదంబునందు విభూతిరుద్రాక్షమహిమంబును ఊర్ధ్వపుండ్రశంఖచక్రధారణనిరసనంబును పాదోదకప్రసాదోదకధారణంబులును లింగార్చనమహిమయు లింగధారణంబును అర్హనర్హనైవేద్యనిశ్చయంబును షడ్విధనైవేద్యనిర్ణయంబును అధికారవిశేషంబును ప్రస్థాదరహితప్రాణాగ్నిహోత్రయజ్ఞకర్మనిరసనంబును పితృశేషదోషంబును అదీక్షితప్రసాదస్వీకారదోషంబును వ్యాసజెమినీసంవాదంబును అష్ఠమూర్తిసముద్భవంబును లింగానర్పితభాగదోషంబును విమిశ్రితదోషంబును విమిశ్రితప్రసాదస్థలంబును అందు యింద్రనారదసంవాదంబును ఘంటాకర్ణుండు సూర్యుం బరిభవించుటయు మునికుమారుకథయును దూర్వాసుండు విష్ణుని శపించుటయు సుకేశిచరితంబును మారమాంబక