పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

శ్రీమించు నాంథ్రదేశము। క్షేమముకర్నూలుజిల్ల శిరువళ్ల యనే
సీమన్ తాలూక నపర। గ్రామము పెదచింతకుంట గల దప్పురిలోన్.

కర్నూలుజిల్లా శిరువళ్ల తాలూకా పెదచింతకుంట గ్రామనివాసి వైశ్యరత్నాకరుండగు పసవుల పుట్టయ్య శ్రేష్ఠివారి కుమారులు నాగయ్యగారు తండ్రియగు పుట్టయ్యశ్రేష్ఠిగారు తీరిపోవునప్పుడు సత్కార్యము యాచరించుమన్నందుకుగా యీపండితారాధ్య గ్రంథమును చదివి చూచి యింతకు నాకు మేలుతోచక రెండు తాటిఆకులగ్రంథములున్నూ వకటి చేతివ్రాతకాగితపుస్తుకగ్రంథమును యీనాగయ్యయును నిడుదవోలు సుందరపంతులవారును వివరముగా చూచినవెనుకనే యీనాగయ్యగారు పుట్టయ్యగారివాక్యమునకుగాను అచ్చుకు విడిచియున్నారు. శ్రీగిరి షణ్మంతస్థాపనాచార్యులగు దిగంబర మల్లికార్జునస్వాముల సేవకుడును పడకండ్ల వీరయ్యగారికి ముఖ్యశిష్యుండును అయిన యీనాగయ్యగారు గురువాక్యమునకు శ్రీమహేశశతకమును శివార్పణముగా సమర్పించియున్నారు.

క.

పడకండ్లపురము పడమర। దడయుచు యయ్యేటితూర్పుదరి గురుకృప
మృడు
గుడిమ్రోలమఠమునందొ।ప్పెడిశ్రీపద్మసాలెవీరయగొలుతున్.


గీ.

విజయరామచంద్ర విభవ ముద్రాక్షర। శాల పండితేంద్రు సచ్చరిత్ర
దొడిరి విన్నకోట దుర్గరావులసభ। చర్చ జేయబడె విశాఖపురిని.


క.

గృహమున నీకృతియుంచుక
బహుళముగా చదివి విన్న భాగ్యము లొసగున్
నహరహమును పఠియించిన
సహజంబుగ ముక్తి యొసగు శంభుడు కృపతోన్.

శ్వేతవరాహకల్ప వైవస్వతమన్వంతర కలియుగ ప్రథమపాదమున 5054 అగునేటి ఆనందనామసంవత్సర ఆషాడ బ13 సోమవారము పండితారాధ్యచరిత్ర పంచమప్రకరణము యుక్తమయినది. మునులవాక్యమునకుగాను యీ నాగయ్యగారికి విక్రమనామసంవత్సర మార్గశిర బ 10 లు యత్యాశ్రమమును శ్రీగిరి మల్లికార్జునస్వాములవారు యిచ్చియున్నారు.