Jump to content

పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

పండితారాధ్యచరిత్ర

డితయ్య
అఖిలలోకమయుండు హైమవతీశు
డఖలలోకాతీతు డాపండితయ్య
లోకానుసారి త్రిలోచనుండిలన
లోకానుసారశీలుడు పండితయ్య
అరుదగులోకసంహారుండు శూలి
కరుణమైలోకోపకారిపండితుడు
అసితకంఠుండు దానసమలోచనుడు
భసితకంథుండు దాపండితేంద్రుండు
ఊర్ధ్వైకలోచనుం డుడురాజమౌళి
యూర్ధ్వలోచనయుగుం డొగిపండితయ్య
భక్తైకదేహుండు పరమేశ్వరుండు
భక్తసంత్రాణుండు పండితస్వామి
మల్లికార్జునసామి మల్లికార్జునుడు
మల్లికార్జునకీర్తి మహిబండితయ్య
మహిలోన బండితమల్లికార్జునిని
మహిమవర్ణింపంగ మనుజులదరమె
కడునర్థి వుత్పత్తి కర్త నాబ్రహ్మ
వడిబ్రహ్మమను బ్రహ్మాదులదృంచి
హరభక్తి యుత్పత్తి కధిపతినాగ
బరిగెనుతొల్లి శ్రీపతిపండితయ్య
స్థితికర్త హరిమమాపతికి మ్రొక్కించి
క్షితివిష్ణుపాదుల గీటణగించి
చెనసి భక్తిక్రియాస్థితికర్త యనగ
జనియెను లెంకమంచన పండితయ్య
గాఢమైసంహారకర్తయె యనుచు
సాధారణముగ నీశ్వరుబల్కు భక్త
దూరాన్యసమయసంహారుడై చనియె
శూరుండు మల్లికార్జున పండితయ్య
భ్యాసిత భక్తికి కారణపురుషు
డై పండితత్రయంబన భువి జనియె
తనరు నీపండితత్రయములో మాన్యు
డననొప్పు మల్లికార్జున పండితయ్య
అట్టిపండిత మల్లికార్జును మహిమ
యిట్టలంబుగ నుతియింతునెట్లనిన
ధర తత్కథానుసంధానంబు వినుము
కరమొప్ప దక్షిణకైలాస మనగ
జను సర్వపర్వత సార్వభౌమాఢ్య
తను బేచున్ శ్రీగిరీంద్రంబుదానదియు
అనుపమ ప్రమథగణస్థానవేది
మునులముముక్షుల మొదలిబండరువు
బాగొందబండితు పండినతపము
ప్రోగైనముక్తి శంభునియశోరాశి
కరువుగట్టిన మహాకాశంబు శ్రుతుల
శిరము ఖనీభవించిన పరంజ్యోతి
తరగనిపుణ్యంబు తవనిధినుతుల
గురుసదాశివునియంకుర మద్రిజాత
వలపటివరిభక్త వరులయిల్వేల్పు
చలనంబు లేని విజ్ఞానాభికడలు
ధృతిముద్దగించిన దివ్యామృతంబు
లత గరిగొన్న మూలస్తంభ మనగ
జెలువారునట్టి శ్రీశైలశిఖర
కలిత త్రిలోక విఖ్యాతియశఃప్ర
పూర్తియౌ శ్రీస్వయంభూలింగచక్ర
వర్తియసమకీర్తివారి తనతజ
నార్తి శ్రీమన్మల్లికా