పుట:నారాయణీయము.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vi

తిరువనంతపురమున శ్రీ అనంతపద్మనాభుని చరణారవింద సన్నిధానమున పౌరజన మహాసభగూర్చి, మళయాళ భాషానువాదముతో సంస్కృత మూలము, నాయనువాదమును బఠింపఁజేసి పరమానంద భరితులై బహుముఖముల నన్ను సంబాలించుటయేకాక, నారాయణ భట్టపాదుని చరిత్రము నాంగ్లమున రచించి యిచ్చిన త్రివేండ్రము ప్రాచ్యపుస్తకాలయాధినేతలగు శ్రీ ఎస్ . కుంజన్ పిళ్ళెగారును తత్సూర్వాధి కృతులగు శ్రీ గోపాల పిళ్ళెగారును నచట నన్నుం గలిసికొనిన సకల మళయాళ విద్వత్కవి మిత్రులును, కేరళ దేశస్థిత కన్యాకుమారి ప్రభృతి దివ్యక్షేత్రాది సందర్శనమున నాకు బాసటయై నాకాప్త మిత్రములైన శ్రీ గవర్నరు మహాశయుల కాంతరంగిక కార్యదర్శులైన సౌజన్యమాన్యులగు శ్రీ అవసరాల అనంత కామేశ్వరరావుగారును మత్ప్రశంసాపాత్రు లగుచున్నారు.

మున్నును నేడును ఇఁకముందును నేతత్కృతి యంద చందముల కానందించి దీనికి శాశ్వతస్థితిం గల్పించి నన్నుం ధన్యుంజేయఁగల యనసూయులగు కవులకు, సాధూత్తములగు భక్తులకు, సాధ్వీమతల్లులకు నా వినతి వినుతు లర్పించుచున్నాను.

ఇట్లు

కృతికర్త