పుట:నారాయణీయము.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

25


“ము న్నినుఁ గాంచి సిగ్గువడి మోములు పంచిన వేళ చీర లీ
 వన్ని హరించి పొన్నతరు వక్కొన కొమ్మకు నెక్కి"

"ఇచ్చటి కీరు వచ్చికొనుఁ డెవ్వరి చీర యదేదొ యెంచికొం డిచ్చెదఁ జారులోచన లివే యనుచున్" పరిహాసము చేయ కన్య లెల్ల ... "వారిఁ దొఱంగి గట్టునకు వచ్చి కరమ్ములు దోయిలించి... వల్వ లిమ్మనన్, వారు పవిత్రలౌటఁ గని వస్త్రములెల్ల ననుగ్రహించి "నాఁడవట--

గోపకుమారికలు పవిత్రలగు దాఁక వారిని క్లేశపెట్టి ప్రాయశ్చిత్తపూర్తి కాంగానే వస్త్రము లిచ్చి యాదరించినాఁడు శ్రీకృష్ణపరమాత్మ. ఈ ధర్మసూత్రము నిందు వాచ్యము చేయకుండుట కావ్యత్వమును వెల్లడించుచున్నది. భాగవతమున కన్యకలు చేసిన తప్పు వాచ్యముగా నిట్లున్నది.

“యూయం వివస్త్రా యదపో ధృతవ్రతా
 వ్యగాహ తైతత్తదు దేవహేళనం
 బద్ద్వాంజలిం మూర్ద్న్యపనుత్తయే౽0హసః
 కృత్వా నమో నో వసనం ప్రగృహ్యతాం,
        (వ్యగాహత - ఏతత్ -తత్ +ఉ.)

మీరు ధృతవ్రతలయ్యును వివస్త్రలై ,నదీజలములందు స్నానముచేయుట దేవుని హేళన మొనర్చుట యగును. ఆ దేవహేళనజనిత పాపము తొలగుటకై శిరస్సున అంజలిపట్టి నమస్కరించి మీ బట్టలను తీసికొనుఁడు" అని. అట్లే వారు చేసి పవిత్రలై చీరలను దీసికొనిరని యిందు ధ్వనితమని యెఱుఁగఁ దగును.

కృష్ణపరమాత్మభక్తపరాధీనుఁడు. కావున "వ్రతపూర్తి౯మును గోపికా మణులకు౯ వాగ్దానము౯ జేసి (యచ్యుత) కందర్ప మహోత్సవము" -- అది చెల్లింపవలదా ? అనునట్లు వేణుగాసమున శరద్రాత్రియం దాకర్షించి వారి ననంగ కేళీ ప్రపంచముస రంజించుచు

“వలువలు హరించినప్పుడు, వలువలు హరియింతు ననిన వాగ్దాన మ్మి
 వ్వలన౯ రసవివశస్వాం, తల కింతుల కప్పగించి"

తనియించినాఁడు. సరసమగు కల్పన! ఇంతకంటెను ఆంద్రీకరింపనలవిగాని యీ క్రింది పద్యమువలన దీవితకవి రచనానై పుణి యుచ్చైఃకోటి కెక్కినది.

“విరహే ష్వంగారమయః శృంగారమయశ్చ సంగ మే త్వం
 నితరా మంగారమయ స్తత్రపున స్పంగ'మేపి చిత్ర మిదం!"