పుట:నారాయణీయము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10


ఏవం దుర్లభ్యవస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్య
త్తన్వా వాచా ధియావా భజతి బత జనః క్షుద్ర దైవస్ఫుటేయం
ఏతే తావ ద్వయంతు స్థిరతరమనసా విశ్వపీడాపహత్యై
నిశ్శేషాత్మాన మేనం గురుపవనపురాధీశ మేవాశ్రయామః.

అను శ్లోకమునకు

అందలి వస్తువిట్లు తన యంతనయందినఁ జేత వాతఁగా
కెందునొ దేవులాడు జన - మెక్కడి నై చ్యమొ, కాని మా మన
మ్మిందె లయింప విశ్వరుజ లీఁగఁగ నీ పరిపూర్ణతత్త్వ మా
కందము నాశ్రయించెద మఖండదయారస మూలకందమున్ .

అని ముద్దులొలుకు నాంధ్రీకరణము, 'సులభతయా హస్తలబ్ధే' యనునది 'తన యంతన యందిన'యని తెలుఁగునుడికారముగాఁ గరఁగించిపోయుట, 'అన్యత్తన్వా వాచా ధియా వా భజతి జనః' అను దళమును 'చేతవాతఁ గా, కెందునో దేవులాడు జనము' అని తెలుఁగు జాతీయమునఁ ప్రతిఫలింపఁజేయుట, మిక్కిలి యక్కజము అనిపింపక మానదు. “నిశ్శేషాత్మాన మేనం"అను రెండు పదములను 'పరిపూర్ణతత్త్వమాకందము' అని తియ్యమామిడిపండుగా నిరూపించుటయే కాదు. అ మాకందమునకు అఖండ దయారసము మూలకందమని మూలమున లేకున్నను ఉపరంజక విశేషణము గూర్చుట కెంత నై పుణి యుండవలెను! అంత్యానుప్రాసమువలనఁ బద్యమున కొక 'కాంతి' గూడఁ జేకూఱినది. అట్టి స్వాతంత్ర్యము శ్రీనాథుని యాంధ్రీకరణమునందు గనఁబడును. కావుననే యవి స్వతంత్ర కావ్యములవలె నుండును, విరహిణియగు దమయంతి చంద్రునుపాలంభించు ఘట్టమున

“అసిత మేక సురాశిత మప్యభూ, న్నపున రేష విధు ర్విశదం విషం
 అపి నిపీయ సురై ర్జనితక్షయం, స్వయ ముదేతి పునర్నవ మార్ణవం"

అను శ్లోకమునకు సంధీకరణమువ

"హాలహలద్వయంబు కలశాంబుధిఁ బుట్టి వినీలపాండుర
 జ్వాలలతోడ: నందొక విషంబొక వేలుపు . మ్రింగె; నెందఱో
వేలుపు లోలిమై ననుభవించిన రెండవ యీవిషంబు ని
ర్మూలము గాక యున్నయది ! ముద్దియ పాంథుల పాప మెట్టిదో"