పుట:నారాయణీయము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5

కావున “నీ వెక్కడనేని వేదముల నింకఁ బఠింపు". మనఁగా భట్టపాదుఁడు “నిన్నె నా దిక్కనుకొంటి వేఱ గురుదేవత లేదు. అటు కాదయేని, నా కిక్కడ కింతె దక్కెఁ జదువు...' అని పల్కి 'ఎనిజన్మమ్ముల కేని నమ్మెదను నిన్నేకోగురు ర్దైవత' మ్మనెనఁట. ఆ పల్కులు విని, గురువు వత్సలుఁడై 'నా క ధ్యాపనప్రాప్తి. లేక పోయెనని నినుఁ బొమ్మంటిని కాని పోవలదు' అని గ్రంథమును జేఁబూని సాంగముగ సాంతముగవేద మా శిష్యునకుఁ గఱ పెనఁట. 'అధికారానకుమించి నట్టిపని తానై చేసి మోహాన దుర్విధిచేతన్ గనెఁ బక్షవాతము' గురుఁడు, *అట్లుగ్రరుజార్తుఁ డౌటకుఁ గడున్ క్షోభించి యాబాధకుం గుఱి తన్నుం బొనరింపవేఁడి, గురు ముక్తుంజేయ నర్థించి యీశ్వరు నర్చించి, యా నారాయణ పండితుఁడు గురుని వాతరోగమునకుఁ దా నగ్గమై గురుని బాధావిముక్తునిజేసి, వెంటనే గురువాయూరు చేరి, యందు నెలకొన్న శ్రీ నారాయణస్వామివారి దేవాలయపు ముఖమంటపమునఁ గూర్చుండి యాదేవుని. సంబోధించుచు భాగవతమునఁ గల యావద్వృత్తమును దినమునకుఁ బదేసి పద్యములచొప్పున నూఱుదినములలో స్తుతీరూపముగా రచించి, యాసహస్రాధికశ్లోక పరిమిత గ్రంథము నాదేవునకు సమర్పించి రోగముక్తుడేకాక భవబంధముక్తుఁడునై. పరిపూర్ణాయురారోగ్యములతో నలరారెనఁట.

"ఆహా! నిరక్షురకుక్షి. సకల శాస్త్రవేత్తయై మహాకవి యగుట యొక యద్భుతఘటన గదా ! అంతకంటె వింత, గురుని పక్షవాత వ్యాధి తన్నావహింపఁ జేసికొనుట, అందును జిత్రము, ఘటిల్లిన యారోగమును భగవదుపాసనచే రూపుమావుట. అంతియకాదు. ఆరోగ్యము నభ్యర్థించు రుగ్ణుల కా గ్రంథ పారాయణ మౌషధమఁట ! భగవదనుగ్రహమునకు సాధ్యాసాధ్యములుండునా? ఇట్టి యఘటనాఘటనలలోఁ దలయెత్తిన దా నారాయణీయము, ఏతన్నామ కరణమును గూర్చి నారాయణ సంబంధి ప్రబంధమా? లేక, నారాయణకవి కృతకృతియా యని సందేహము కలుగకుండ మూలకారుఁ డుభయార్థము లిందుఁ గలవని “ద్వేధానారాయణీయ" మ్మని యుపసంహారమునఁ జమత్కారముగాఁ దెలిపియున్నాఁడు, అట్లు నామసార్థకతయే కాక “ఇద మిహ కురుతా మాయురారోగ్యసౌఖ్యం " అని యాశీరూపఫలమునుగూడఁ జెప్పియున్నాఁడు. ఈ రీతిగా నన్వర్ధ నామకమయి యీ నారాయణియ మింత ప్రశస్త మగుటయు, అనువాదము మూలమునకు వన్నె వెట్టు రసవత్తర ప్రౌడపాకమున నవతరించు