పుట:నారాయణీయము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

x


అన్యుల్ గారు కవుల్ సగోత్రజు, లనన్యప్రీతి మాచేత నీ
కన్యాదాన మహోత్సవమ్ము జరుగంగాఁ గోరి, రెంతేనియున్
ధన్యమ్మయ్యెను మా సతీపతులదౌ దాంపత్య, మీలాటి స
త్కన్యన్ జేతుల దారవోయఁగలిగెన్ గంజాక్షీ ! నీ సత్కృపన్ .

కల్లూ రెక్కడ బూర్గు లెక్కడఁ బ్రభూ ! గారాబ మొప్పంగ, నా
యుల్ల మ్ముల్లసిలంగఁ గాప్య మొసఁగన్, యుష్మత్కృపావాప్తి శో
భిల్లంగన్ మఱి వారి మానసములన్ బ్రీతిన్ ఘటింపంగ రా
జిల్లెన్ గావ్యకుమారికామణి కడు జిత్రమ్ము నా కన్యయై,

నిరవధియైన భాగ్యమిది నిన్నొక యల్లునిగాగఁ జూడ, సా
గరునకె దక్కె ము, న్నిపుడు కావ్య కలావిభవైకమూర్తి యౌ
గరీతను నీ కొసంగు టొక కారణమై తగె నాకు ; మామనై
గురుపవనాఖ్య పట్టణ వికుంఠ నివాస ! నతుల్ ఘటించెదన్,

నవవిధ బాంధవమ్ముగల నాకిది వావి యొకండు గూడె ని
న్నవిరళభక్తిఁ గొల్వగ, ననారత పాదసరోజ నిర్గల
త్ప్రవిమలసీధుపాన పరిపాకము నొందగ హక్కు గల్గె, నో
పవనపురాధివాస : భవ. పాళవినాశ ! జగత్పతీ ! హరీ !

సుబ్రహ్మణ్యులు వీరభద్రులు కవుల్ సుశ్లోకు లుర్వీసురుల్
అబ్రం బేమి భవత్ప్రసాద మహిమ మ్మర్థించి యర్పింపఁగా
శుభ్రాంతఃకరణన్ వచః కుసుమముల్ శోభిల్లు హారావళిన్ .
 విభ్రాజ ద్వనమాలికోదర ! యిదే వీక్షించి కై కోఁగదే ! .